పాలకోసం పోలీస్ సేష్టన్ లో ఫిర్యాదు..

buffalo

సమాజంలో ప్రజలు తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ కొంతమంది తమ అమాయకత్వంతో ఇచ్చే ఫిర్యాదులు కామెడిగా అనిపిస్తుంది. అలాంటి ఓ పెద్దాయన తన బర్రె పాలు ఇవ్వటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లేని నయాగావ్ ప్రాంతలో జరిగింది. బాబూలాల్ జాదవ్ అనే ఓ రైతు కొన్నాళ్ల క్రితం ఓ పాలిచ్చే గేదెను కొన్నాడు. బర్రె కొన్నాళ్లుగా పాలివ్వట్లేదని, పాలు పితకబోతే తంతోందని జాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. తన బర్రెకు ఎవరో చేతబడి చేసివుంటారనే అనుమానం ఉందని తెలిపాడు. సాయం కోసం తనతో పాటు బర్రెను పోలీస్టేషన్ కు వెంటబెట్టుకోని వెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జాదవ్ అమాయకత్వాన్ని గ్రహించిన పోలీసులు పశు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. పోలీసుల సలహా మేరకు బాబులాల్ బర్రెను పశు వైద్యుడికి చూపించాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి తన బర్రె పాలు ఇస్తోందని చెప్పి, వారికి ధన్యవాదాలు తెలిపాడు. జాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియా డ్రెస్సింగ్‌ రూమ్‌ లో అంబరాన్ని అంటిన సంబరాలు.. వీడియో వైరల్‌