ఒకేసారి 9మంది శిశువులకు జన్మనిచ్చిన తల్లి!.

25 ఏళ్ల మహిళ చరిత్ర సృష్టించింది. ఒకేసారి ఏకంగా 9మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే అనే మహిళ‌కు నెలలు నిండటంతో కుటుంబసభ్యులు ఆమెను మొరాకోలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె ఒకేసారి 9మందిని ప్రసవించింది. వీరిలో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. ఈ విషయాన్ని మాలి దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సిబీ తెలిపారు.

సాధారణంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మ నిస్తేనే కొంచెం కవల పిల్లలు అంటూ ఆసక్తిగా చూస్తాం. ఒక్కోసారి ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టారంటే ఆశ్చర్యపోతాం. చాలా అరుదుగా నలుగురు పిల్లలను ఒక మహిళ కన్నది అని తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సి వస్తుంది. కానీ, ఒక మహిళ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మను ప్రసాదించింది. ఈ సంఘటన మాలి దేశంలో చోటు చేసుకుంది. డాక్టర్లే ఆశ్చర్యపోయేలా చేసిన ఈ సంఘటన గురించి తెల్సిన ఆ దేశ ప్రభుత్వమూ ఆశ్చర్యపోయి ఆ తల్లికి ఆమెకు వైద్యం చేసి పురుడుపోసిన డాక్టర్లకు శుభాభినందనలు తెలిపింది.

ల్లీ, నవజాత శిశువులు అందరూ బాగానే ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే మొరాకో, మాలిలలో నిర్వహించిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రకారం సిస్సే కడుపులో ఏడుగురు శిశువులున్నారని వైద్యులు గుర్తించారు. కానీ సీజేరియన్ ఆపరేషన్ తర్వాత 9మంది శిశువులకు జన్మనివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. జననాల్లో పుట్టిన ఈ శిశువులకు తరుచూ వైద్య సమస్యలు తరచూ తలెత్తవచ్చని డాక్టర్లు చెబుతున్నారు