ఈనెల 26న ఆకాశంలో అరుదైన అద్భుతం – బ్లడ్ మూన్!

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 26న ఏర్పుడుతోంది. గ్రహణం తర్వాత చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌ గా దర్శనం ఇవ్వనున్నాడు. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తారు. సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి భూమి వస్తుంది. ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ మాత్రమే చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాలు ఫిల్టర్‌ అవుతాయి. ఈ సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించనున్నాడు. భారత దేశానికి ఈశాన్య దిక్కున ఆకాశంలో  సాయంత్రం ఈ అరుదైన సూపర్‌ బ్లడ్‌ మూన్‌ కనిపించబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుంది.

image 20150925 16033 1h2z2f

ఈ గ్రహణం సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమై 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఇది సంభవించనుంది. కాగా దేశంలో చంద్రగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. అంటే 14 నిమిషాల 30 సెకన్ల పాటు గ్రహణం ఉంటుంది. అనంతరం సూపర్ బ్లడ్ మూన్ కనులవిందు చేయనుంది. ఈ చంద్రగ్రహణం తరువాత- జూన 10వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. నవంబర్ 19వ తేదీన మరోసారి చంద్రగ్రహణం ఏర్పడుంది. అది పాక్షికమే. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 4వ తేదీన మరోసారి సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ చంద్ర గ్రహణం ఈశాన్య ఆసియా, పసిఫిక్‌ సముద్రం, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఆస్ట్రేయాలియాలో బాగా కనిపిస్తుందని తెలిపారు.