మిస్ యూనివర్స్ 2021 మెక్సికో అందం ఆండ్రియా

ఇంటర్నేషనల్ డెస్క్- మెక్సికో అందాల భామ ఆండ్రియా మెజా 2021 విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో గెలుపొంది మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకుంది. మొత్తం 73 మందిని దాటుకుని ఆండ్రియా విశ్వ సుందరి 2021 టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మూడో మెక్సికన్‌గా ఆండ్రియా మెజా రికార్డుల్లోకెక్కింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆండ్రియా, మహిళా హక్కుల కోసం, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.

Miss univers

ఇక ఈ మిస్ యూనివర్స్ 2021 పోటీలో తొలి రన్నరప్‌ గా మిస్‌ బ్రెజిల్‌ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్‌ పెరూ జానిక్‌ మెసెటా డెల్‌ కాసిలో నిలిచారు. మిస్‌ ఇండియా అడెలిన్‌ కాస్టెలినో టాప్‌ 5లో స్థానం సంపాదించుకుంది. మన ప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది.. మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు.. అంటూ ఆండ్రియా చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. అందంతో పాటు ఈ సమాధానం ఆమెకు విశ్వ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. ఇకపై కూడా తాను మహిళల హక్కులతో పాటు, లింగ వివక్షపై పోరాటం కొనసాగిస్తానని ఆండ్రియా చెప్పింది.