తల్లికి క్యాన్సర్, వైద్యం కోసం వ్యభిచారంలోకి 11ఏళ్ల మైనర్ బాలిక

స్పెషల్ డెస్క్ కన్న తల్లికి క్యాన్సర్.. వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. క్యాన్సర్ వైద్యానికి లక్షల్లో డబ్బులు కావాలి. కానీ ఏంచేయాలో తెలియదు. ఇటువంటి సమయంలో పని ఇప్పిస్తానని ఓ మహిళ చెప్పడంతో తన 11 ఏళ్ల కూతురును పంపించిందా తల్లి. కానీ ఆ మహిళ చేసిన పనికి ఆ మైనర్ బాలిక జీవితం నాశనం అయ్యేది. కాస్తలో అమె జీవితం ప్రమాదంలో పడకుండా తప్పించుకోగలిగింది.

అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ కు సమీపంలోని ఓ ప్రాంతంలో అర్చన, రంజమా, కవిత అనే మహిళలు ఓ అపార్ట్‌ మెంట్‌ను అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఓ కస్టమర్ వారిని సంప్రదించాడు. అమ్మాయిని ఏర్పాటు చేసేందుకు ఈ ముగ్గురు మహిళలు అతని వద్ద 40వేల రూపాయలు తీసుకున్నారు. చెప్పిన ప్రకారమే అతడి కోసం వాళ్లు ఓ అమ్మాయిని ఏర్పాటు చేశారు.

Child 2

ఐతే విటుడిగా వచ్చిన ఆ కస్టమర్ ఆ ముగ్గురు మహిళలకు ట్విస్ట్ ఇచ్చాడు. చివరి నిమిషంలో అతడు పోలీస్ ఇన్‌ ఫార్మర్‌ గా మారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది వెంటనే అపార్ట్‌ మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గరు మహిళలతో పాటు, మైనర్ బాలికను సైతం అదుపులోకి తీసుకున్నారు. 11 ఏళ్ల అమ్మాయి చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగ్ పూర్ కు సమీపంలో నివసిస్తున్న మైనర్ బాలిక తల్లి గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతోందట.

చికిత్స కోసం భారీ మొత్తంలో డబ్బులు కావాల్సి ఉండటంతో దీన్ని అర్చన అనే మహిళ అవకాశంగా తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండేళ్ల బాబును చూసుకోవడం కోసం తన కూతురును పంపిస్తే, 5వేల రూపాయలు ఇప్పిస్తానని బాధితురాలి తల్లికి చెప్పి ఆ మైనర్ బాలికను అపార్ట్‌ మెంట్‌ కు తీసుకొచ్చారు. నమ్మి వెంట వచ్చిన ఆ పసిపాపను వ్యబిచారం చేయాలంటూ బలవంతం చేశారు. ఇష్టం లేకపోయినా తల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బులు అవసరం ఉండటంతో ఆ అమ్మాయి కూడా ఆ పాడు పనికి ఒప్పుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.