ఇంత ‘వరద బీభత్సం’ చైనా గత వెయ్యేళ్లలో చూడలేదు!!.

చైనాలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాల‌కు న‌దులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. హెన‌న్ ప్రావిన్స్‌లో గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా వ‌ర్షాలు మంచెత్తాయి. ఈ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గ‌త వెయ్యి సంవ‌త్సరాల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో వ‌ర్షం కుర‌వ‌లేద‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.

Full Raining minహెనాన్ ప్రావిన్స్‌లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో వీధులతో బాటు సబ్‌వే టన్నేల్‌లోకి నీరు చేరింది.అధిక వర్షాల కారణంగా సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్ జూ లోని సబ్ వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుములోతు నీరు చేరిండంతో 12 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అనేకమంది రైల్లో చిక్కుకుపోయారు. రైల్లో కూడా ఇంతటి వరదనీరు చేరడం ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి హెనన్​ ప్రావిన్సులోని 10 వేల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షానికి జెంగ్జౌ నగరంలో వచ్చిన వరదల ప్రభావం ప్రధాన నగరాలపై పడింది. రహదారులను మూసేశారు. నగరంలోని సబ్ వే రైలు బోగీలో చిక్కుకున్న ప్రయాణికుల భుజాల వరకూ నీరు ప్రవహిస్తున్నట్లు  తెలుస్తోంది.

విమాన సర్వీసులూ రద్దయ్యాయి. 9.4 కోట్ల జనాభా ఉన్న హెనన్​ ప్రావిన్సులో ప్రభుత్వం అత్యంత ప్రమాదకర వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. దేశంలో అనేక చోట్ల కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. మ‌రో కొన్నిరోజులపాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ స్పష్టం చేసింది. నీట మునిగిన రోడ్లు, వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతున్న కార్లు, చెత్తకి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో కనిపించాయి.

హెనన్​ ప్రావిన్సులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఓ డ్యామ్ కుప్పకూలుతుందనే భయాందోళనలూ నెలకొన్నాయి. గత మూడు రోజులుగా జెంగ్జౌలో కురిసిన వర్షం, ఆ ప్రాంతంలో కురిసే సంవత్సర వర్షపాతానికి సమానం. వచ్చే 24 గంటల్లోనూ భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.