మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా

Trivikram Mahesh

ఫిల్మ్ డెస్క్- ప్రిన్స్ మహేశ్‌బాబు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అగ్ర దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తాను తన తర్వాత సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.  సుమారు 11ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఈ ప్రకటనతో మహేశ్‌ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ మూవీతో మహేశ్‌బాబు, అల వైకుంఠపురములో సినిమా ఇచ్చిన విజయంతో త్రివిక్రమ్‌ మంచి ఫామ్‌ లో ఉన్నారు. ఇఖ ఈ కొత్త సినిమాను హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేశ్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.

ప్రస్తుతం మహేశ్‌బాబు పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నారు. కరోనా వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here