గాంధీజీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష!

భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి అన్నీ విధాలా కష్టపడి.., చివరికి దేశ స్వరాజ్య కాంక్ష నెరవేరడానికి ప్రధాన కారణమైన వ్యక్తి మహాత్మాగాంధీ. నిజానికి గాంధీని స్వతంత్ర ఉద్యమం వైపు నడిపింది దక్షిణాఫ్రికాలోని పరిస్థితిలే. అక్కడి జాత్యహంకార ఘటనలు తరువాత.. ప్రపంచంలో ఎక్కడా బానిస జీవితం ఉండకూడదన్న ఆలోచనలు ఆయనలో మొదలయ్యాయి. అలా.. గాంధీజీ ఇండియా తిరిగి వచ్చి, స్వతంత్ర ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి.., భరతమాత దాస్య శృంఖలాలను తెంచగలిగారు. ఇందుకే దక్షిణాఫ్రికా దేశం ఈనాటికీ గాంధీని ఆరాధ్యుడిగా పూజిస్తూ ఉంటుంది. అలాంటి.. దక్షణఫ్రికాలో ఇప్పుడు ఆయన ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష పడటం అందరికీ షాక్ కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్గోబిన్ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ విషయం తెలిసిందే. ఈమె అక్కడి ప్రముఖ వ్యాపార వేత్త SR మహరాజ్ను మోసం చేసినట్లు 2015 లో ఒక కేసు నమోదు అయ్యింది. ఇండియా నుంచి వచ్చే ఓ కన్సైన్మెంట్ కోసం ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు గాంధీ ముని మనవరాలు మహరాజ్ దగ్గర అడ్వాన్స్గా రూ.3.23 కోట్లు తీసుకుందని.., ఈ డబ్బుకి గాను ఆ కన్సైన్మెంట్ ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుందని ఒక అగ్రిమెంట్ జరిగింది.

gandhi 2కానీ.., గాంధీ ముని మనవరాలు చెప్పినట్టు అక్కడ కన్సైన్మెంటే లేదని, నకిలీ బిల్లులు సృష్టించి ఆశిష్ లతా మోసానికి పాల్పడిందన్నది అభియోగం. ఈ విషయంలో అప్పట్లోనే ఆశిష్ లతాని దక్షణాఫ్రికా పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. తరువాత ఈమె బెయిల్ పై రిలీజ్ అయ్యింది. ఇక 2015 నుండి నడుస్తూ వచ్చిన ఈ కేసులో డర్బన్ కోర్టు ఇన్నాళ్ళకి సంచలన తీర్పు వెల్లడించింది. ఆశిష్ లతా మోసానికి పాల్పడిందని కోర్టు నమ్ముతోంది. ఆమె మోసపూరిత చర్యలో భాగంగా… లేని కన్సైన్మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్లు, డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదంతా ఆమె కావాలని పూర్తి స్పృహతో చేసిన మోసంగా కోరు భావిస్తోంది. ఇందుకే ఆశిష్ లతాకి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు కాపీని చదివి వినిపించారు. ఈమె తల్లి, గాంధీజీ మనవరాలైన ఎలా గాంధీ సైతం ఇదే దక్షిణాఫ్రికా దేశం నుండి అనేక సత్కారాలు పొందారు. కానీ.., ఆమె కూతురైన ఆశిష్ లతా మాత్రం ఇలా మోసపూరిత కేసులో జైలుపాలవ్వడం విచారించతగ్గ విషయం. మరి.., మహాత్మాగాంధీ ముని మనవరాలు అరెస్ట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.