మగాడివి అయితే నాతో పెట్టుకో, నా ఫ్యామిలీ పేరు ఎత్తితే తాట తీస్తా: మంచు విష్ణు

ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు అంతకంతకు కాక పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కలిసి మెలసి ఉన్న సినిమావాళ్లంతా గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ యుధ్ద వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మా ఎన్నికల్లో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీలో ఉన్నాయి.

ఇక ముందు నుంచి మా ఎన్నికల నేపధ్యంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుకు మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. తాజాగా మరోసారు మంచు విష్ణు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంత మంది సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. ప్రకాశ్‌ రాజ్‌కు ఓ దశలో మంచు విష్ణు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రకాశ్‌రాజ్‌ గారు.. మంచు ఫ్యామిలీ అంటూ ఇంకోసారి నా కుటుంబం పేరు తీస్తే మీ పేరు పక్కన ‘గారు’ అనేది ఉండదు.. అని అన్నారు.

Prakash Raj and Manchu Vishnu

నేను అధ్యక్ష అభ్యర్థిని.. ఓటు అడిగే హక్కుంది.. మీకు దమ్ము, సత్తా ఉండి.. మగాడు అనుకుంటే నా పేరే తీయండి.. మా అక్క, తమ్ముడు, నాన్నను లాగకండి. నా కోసం నా కుటుంబం ఓటు అడగవచ్చు. ఓటు వేయమని అడగటానికి ఫోన్‌చేేస్త గిరిబాబుగారు మీ ప్యానల్‌కు ఇచ్చిన క్లాస్‌ సరిపోదా.. శ్రీకాంత్‌ గారు మీరంటే నాకు చాలా ఇష్టం.. ఆ ప్యానెల్‌లో ఉన్న హేమ, బెనర్జీగారు మీరందరూ నాకు ఇష్టమే.. అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

ఈనెల 10వ తేదీ తర్వాత మనం ముఖాలు చూసుకోవాలి.. 11వ తేదీ ప్రకాశ్‌ రాజ్‌ ఫ్లైట్‌ ఎక్కి వెళ్లిపోతారు.. మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి.. మేమంతా మీ కుటుంబం.. మేము ఎవరినీ విమర్శించటం లేదు.. ‘మా’ కుటుంబాన్ని దయచేసి విడగొట్టకండి.. అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ సైతం మంచు విష్ణు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.