షాకింగ్ న్యూస్! మరోసారి మిడతల దాడి! ఎప్పుడో తెలుసా?

మనలో చాలా మంది 2020 సంవత్సరాన్ని తిట్టుకునే ఉంటాము. కరోనాని తీసుకొచ్చి మా మధ్య వదిలింది. ఇది చాలా బ్యాడ్ ఇయర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి ఉంటాము. కానీ.., ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే 2020 కన్నా 2021 చాలా కఠినంగా ఉంది. పోయింది అనుకున్న కరోనా వేరియంట్స్ రూపంలో తిరిగి వచ్చింది. ఇక దీనికి బంధువులా అన్నట్టు.., బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యల్లో ఫంగస్ పుట్టుకొచ్చాయి. ఇక మరో వైపు ఒకదాని తరువాత ఒకటిగా తుఫానులు పుట్టుకొస్తున్నాయి. దీనితో.., ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ దేశంపై మిడతల దాడి జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. త్వరలోనే భారీ సంఖ్యలో మిడతలు పంట పొలాలపై దాడి చేసే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లా అధికారులు రైతులని అప్రమత్తం చేశారు. మిడతలు అకస్మాత్తుగా రావడం.. పచ్చదనాన్ని నాశనం చేసి వెళ్లిపోవడం మిడతల దండు స్వభావం. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణించి ఆ మార్గంలో ఉన్న పంట పొలాలు చెట్లపై వాలిపోతాయి. పంటను తిని మరో ప్రాంతానికి దండెత్తుతాయి. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మచ్చుకు మన దేశానికి కూడా గతేడాది అనుభవమైంది.

midathalu 2ముఖ్యంగా యూపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో మిడతల ప్రభావం ఎక్కువగా కనిపించింది. వేల ఎకరాల పంట ను ఈ మిడతలు నాశనం చేశాయి. దీనితో రైతులు వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. మళ్లీ మిడతల ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్పడం తో రైతులు ఆందోళనకి గురవవుతున్నారు. ప్రస్తుతం ఈ మిడతల దండు తూర్పు ఆఫ్రికాలోని కెన్యా ఇథియోపియాను వణికిస్తోంది. అసలే కరోనా మహమ్మారి కరవు ఆర్థిక సంక్షోభంతో తిప్పలు పడుతున్న ఆ దేశాలకు ఇప్పుడు ఈ దండు పెద్ద గుది బండగా మారింది. ముఖ్యంగా కెన్యాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ రెండో దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా కెన్యాలోనే జరుగుతున్నాయి. వాటిని పారదోలేందుకు సైనికులు కూడా రంగంలోకి దిగారు అంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతాలు జనావాసాలు కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ.. వాటిని కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ.., సెప్టెంబర్ కాలంలో మిడతల దండు ఇండియాలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మరోసారి వేల కోట్ల పంట నష్టం జరగక తప్పదు. మరి ఇన్ని విపత్తులు సృష్టిస్తున్న 2021 సంవత్సరం మీకు ఎలా అనిపిస్తోంది? ఈ విషయంలో మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.