పాకిస్థాన్లో పాక్షిక లాక్డౌన్ !…

పాకిస్థాన్లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున పాక్షిక లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఇస్లామాబాద్ సహా.. మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ పంజాబ్ లోని ప్రావిన్స్ లోని ఏడు నగరాల్లో లాక్ డౌన్ విధించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో లాహోర్, రావల్పిండి, సర్గోధ, ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రన్వాలా, గుజరాత్ నగరాల్లో రెండు వారాల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. రేపటి నుంచి ఈ ఏడు నగరాల్లో పూర్తి స్థాయికో లాక్ డౌన్ పాటించాలని ప్రజలకు ఈ మేరకు ప్రభుత్వానికి సహకరించాలని ఓ ప్రకటన రిలీజ్ చేసింది.షనల్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎన్సిఓసి) పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. ఇక లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం మరియు అవసరమైన వస్తువులతో పాటు బేకరీ వంటి దుకాణాలు రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి మాత్రమే ఇంటిని విడిచి వెళ్ళడానికి అనుమతించారు. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదకాగా.. ఇప్పటి వరకూ మొత్తం 13, 476 మంది మరణించారని తెలుస్తోంది. ఇక వ్యాక్సిన్ కోసం ఓ వైపు చైనా ను పాక్ ప్రభుత్వం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లోకి వెళ్తుందన్న కారణంతో పూర్తిస్థాయి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రతిపాదనను ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు ప్రతిఘటించారు, అయితే ఒక వారంలో పరిస్థితి అదుపులోకి రాకపోతే పూర్తి లాక్డౌన్ గురించి ఆలోచించవలసి వస్తుందని ఫవాద్ చౌదరి చెప్పారు. ఇక, వైరస్ వ్యాప్తికి కట్టడి కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్ఓపి) అనుసరించాలని చౌదరి దేశంలోని వ్యాపారులను అభ్యర్థించారు.