లిఫ్ట్ అడిగి డ్రైవర్ ను బ్లాక్ మెయిల్ చేసిన కిలాడీ లేడీ, వీడియో షేర్ చేసిన బండ్ల గణేష్

న్యూ ఢిల్లీ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటారు చాలా మంది. అవసం ఉన్న వారికి తమకు తోచినవిధంగా హెల్ప్ చేస్తారు. కానీ ఈ కాలంలో సహాయం చేయడం కూడా తప్పే అవుతోంది కొన్ని సందర్బాల్లో. ఢిల్లీలో జరిగిన ఈ వీడియో చూస్తే అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో అర్ధం కావడం లేదు. టాలీవుడ్ బడా నిర్మాత బండ్గ గణేష్ ఫోస్ బుక్ లో షేర్ చేసిన ఈ వీడియోలో జరిగిన తతంగం ఏంటో మీరే చూడండి.

ఢిల్లీలోని రోడ్డుపై ఓ అమ్మాయి వెయిట్ చేస్తోంది. అటుగా వెళ్తున్న ట్యాక్సీ వాలాను ఆపింది. అతను ఆగగానే తన పర్స్ ఎక్కడో పడిపోయిందని, తన దగ్గర డబ్బులు లేవని, సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర దింపాలని కోరింది. ఆమెపై జాలితో లిఫ్ట్ ఇచ్చాడు ఆ ట్యాక్సీ డ్రైవర్. కోరులోకి ఎక్కిన ఆ అమ్మాయి, తన పర్స్ పోయిందని, అయినా తనకు లిఫ్ట్ ఇచ్చినందుకు ట్యాక్సీ డ్రైవర్ కు ధ్యాంక్స్ చెప్పింది.

Delhi 1

కాసేపయ్యాక.. ఆ అమ్మాయి నిజస్వరూపం బయటపెట్టింది. ట్యాక్సీ డ్రైవర్ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతా ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఒక్కసారిగా అవాక్కైన డ్రైవర్.. అదేంటీ.. ఏదో పాపం అని లిఫ్ట్ ఇస్తే, డబ్బులు అడుగుతావేంటని ప్రశ్నించాడు. అంతే గొంతు పెంచిన ఆ కిలాడీ లేడి, మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదంటే అరిచి, కారులో తనపై అత్యాచారం చేయోబోయావని అందరికి చెప్పమంటావా అని బెదిరించింది. అలా చేస్తే నీజీవితం నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇచ్చింది.

ఐతే కారులో వెనక సీట్లో కూర్చున్న మరో ప్యాసింజర్ ఈ వ్యవహారాన్నంతా వీడియో తీస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలియదు. గతంలోను ఈ కిలాడీ లేడీ ఇలా బెదిరింపులకు పాల్పడిన విషయం వెనక సీట్లో కూర్చున్న ప్యాసింజర్ కు తెలుసట. ఇంకేముంది అదే విషయాన్ని ఆమెకు చెప్పాడతను. దీంతో ఖంగుతిన్న ఆమె బుకాయించే ప్రయత్నం చేసింది. వాళ్లిద్దరు గట్టిగా మాట్లాడే సరికి మొహం దాచుకుంది. చివరికి సారి చెప్పి వదిలేయండని బతిమాలి కారు దిగిపోయంది. ఇలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మరి.