దమ్ముకొడుతున్న వంటలక్క..కార్తీకదీపం అభిమాలు షాక్

karthukadeepam

ఫిల్మ్ డెస్క్- కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కార్తీక దీపం సీరియల్ అభిమానులే అంటే ఏ మాత్రం అతియోశక్తి కాదు. అందుకే కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ వచ్చే టైం అవుతుందా.. సీరియల్ లో తరువాత ఏంజరగబోతోందన్న ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తుంది.

vantlakka

బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో కార్తీక దీపం సీరియల్ దూసుకెళ్తోంది. ఇక కార్తీక దీపంలో లీడ్ రోల్ పోషిస్టున్న దీప ఇలియాస్ వంటలక్క నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రేమీ విశ్వనాధ్ వంటలక్క పాత్రలో బాగా ఒదిగిపోయింది. ఆమె నటకు అంతా ఫిదా అవుతున్నారు. కార్తీక దీపం సీరియల్ అభిమానులు కొందరైతే ఆమె బుల్లితెర మహానటి అని కితాబిస్తున్నారు. మొత్తానికి కార్తీకదీపం సీరియల్ మొత్తం దీప అదేనండీ వంటలక్క చూట్టే తిరుగుతుంది. దీంతో ఆ పాత్ర పోషిస్టున్న ప్రేమీ విశ్వనాధ్ కు బాగా క్రేజ్ వచ్చింది. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోను కనిపిస్తోంది. ఇప్పటికే ప్రేమీ విశ్వనాధ్ గురించిన తాలా విషయాలు బయటకు వచ్చాయి. ప్రేమీ విశ్వనాధ్ సీరియల్ లో అలా ఉంటుంది కానీ.. బయట రియల్ లైఫ్ లో చాలా స్తైలిష్ గా ఉంటుంది.

kaarthikadeepam

ఈ మధ్య వంటలక్క అలవైకుంఠపురంలో సినిమా లో అల్లు అర్జున్ స్టైల్ ను అనుకరించింది. వంటలక్క ఊర మాస్ అవతారంతో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపుతోంది. చేతిలో నాటు కోడి పుంజుతో ఫోజు ఇచ్చింది. అంతటితో ఆగకుండా నోట్లో సిగరెట్ పెట్టుకుని గుప్పు గుప్పుమంటూ పొగలు వదులుతోంది వంటలక్క. ఎరుపు రంగు లుంగీ.. పసుపు రంగు చొక్కా.. చంకలో కోడి.. చేతిలో కత్తి.. తలపాగా కట్టి తనలోకి కొత్త యాంగిల్‌ని బయటపెట్టింది ప్రేమీ విశ్వనాధ్. ప్రస్తుతం వంటలక్క అలవైకుంఠపురములో లుక్ సోషల్ మీడియాలో తెెగ వైరల్ అవుతోంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను వంటలక్క ఏ మాత్రం తగ్గడం లేదని కామెంట్ చేస్తున్నారు అభిమానులు.