జనారణ్యంలో ఎవరైనా తప్పిపోతేనే గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి కారడవిలో తప్పిపోయిన మహిళను గుర్తించడం అంటే మాటలు కాదు. అసలు వారి కోసం గాలించడమే పెద్ద ప్రయాస వ్యవహారం అవుతుంది. ఆచూకీ కనిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిరూపించారు తెలంగాణ పోలీసులు. వారి ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అడవిలో తునికాకు సేకరణ కోసం వెళ్ళిన ఓ మహిళ తప్పిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రెండు రోజుల తర్వాత మహిళను పోలీసులు కాపాడారు. అది కూడా అత్యాధునిక సాకేంతిక పరిజ్ఞానంతో. అడవిలో తప్పిపోయిన మహిళను వెదికేందుకు పోలీసులు డ్రోన్ కెమరా వాడారు. ఆ ప్రయోగం ఫలించి.. తప్పిపోయిన మహిళ ఆచూకీని గుర్తించారు పోలీసులు. ఆమెను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జయశకంర్ భుపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఆవివరాలు.. వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన శిరీష తునికాకు సేకరణకు అడవిలోకి వెళ్లి.. తప్పిపోయింది. ఆమె ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష ఆచూకీ కోసం పోలీసులు.. తెలివిగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవిని జల్లెడ పట్టారు. రెండు రోజుల పాటు అణువణువూ శోధించారు. అలా వెతుకుతున్న క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి అటవీ ప్రాతంలో శిరీష ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకుని.. శిరీషను అడవి నుంచి బయటకు తీసుకువచ్చి.. ఆస్పత్రికి తరలించారు. ఆమె క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అడవిలో మావోల కదలికల కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’: డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ పంపిణీకి శ్రీకారం చుట్టిన తెలంగాణ!.. ఆ డ్రోన్ కెమెరా సహయంతో శిరీషను కూడా కాపాడగలిగారు. శిరీష దొరకడం పట్ల కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు చూపిన సమయస్ఫూర్తిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: రాజధానిలో డ్రోన్ల సంచారం నిషేధం ! మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.