ఐఫోన్ 13 వచ్చేసింది, ఫీచర్స్ కు ఫిదా కావాల్సిందే

టెక్ డెస్క్- యాపిల్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ప్రధానంగా ఐఫోన్‌ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్‌ 13 గులాబీ, నీలం తదితర అయిదు అందమైన రంగుల్లో అందుబాటులో ఉంది. యాపిల్ ఫోన్ లవర్స్ ను ఈ ఫోన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఐఫోన్ 13 ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెనుక వైపు అధునాతన డ్యుయల్‌ కెమెరాలు, 5జీ, 6 కోర్‌ సీపీయూ, 4 కోర్‌ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్‌ చిప్‌సెట్‌ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఐఫోన్‌ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంది. ఐఫోన్‌ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్‌ 12తో పోలిస్తే ఐఫోన్‌ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది.

sunset gold iphone 13

ఐఫోన్‌ 13 మినీ ధర 699 డాలర్ల నుంచి, ఐఫోన్‌ 13 ధర 799 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇక ఐఫోన్ 13 స్టోరేజీ అంశానికి వస్తే 128 జీబీ నుంచి లభిస్తున్నాయి. ఐఫోన్‌ 13 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ను అమర్చారు. ఐఫోన్‌ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్‌ లాంచ్ చేసింది. వాచ్‌ 7 సిరీస్‌ రేటు 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

ఇక ఐఫోన్ ప్రో ధర 999 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్‌ రేటు 1,099 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇందులో 128 జీబీ నుంచి 1టీబీ దాకా స్టోరేజీతో లభిస్తుంది. ఐఫోన్‌ 13 ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి, డెలివరీలు 24 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఐపోన్ ప్రియులు ఇప్పటికే ఆర్డర్స్ చేసి, ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

భారత్ లో iPhone 13 Mini ధరలు

128 GB 69,000
256 GB 79,900
512 GB 99,900

భారత్ లో iPhone 13 ధరలు

128 GB 79,900
256 GB 129,900
512 GB 149,900
1TB 1,69,900

భారత్ లో iPhone 13 Pro ధరలు

128 GB 1,19,900
256 GB 1,29,900
512 GB 1,49,900
1TB 1,69,900

భారత్ లో iPhone 13 Pro Max ధరలు

128 GB 1,29,900
256 GB 1,39,900
512 GB 1,58,900
1TB 1,79,900