ఉగాండాలోని కంపాలలో జంట పేళ్లులు

ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ఉగాండాలోని కంపాలాలో వెళ్లింది. అక్కడ వేరువేరు చోట్ల రెండు బాంబు పేళ్లులు సంభవించాయి. అయితే బాంబు పేలుళ్ల ఘటన నుంచి భారత్ ఆటగాళ్లు తృటి తప్పించుకున్నారు. జట్టు బస చేసిన హోటల్‌కు కూత వేటు దూరంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో భారత ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ పలువురు గాయపడినట్లు సమాచారం.

ugarn minఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు కొద్ది రోజుల క్రితం అక్కడికి చేరుకుంది.ఈ జట్టులో టోక్యో పారాలింపిక్స్-2021లో పతక విజేతలు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, ఇతర ఆటగాళ్లు ఉన్నారు.

ఈ జంట పేలుళ్లులో పలువురు గాయపడ్డారని ఉగాండా సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే మరింత సమాచారం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించి తర్వాత వెల్లడిస్తామని ఉగాండా రెడ్‌క్రాస్ ప్రతినిధి తెలిపారు.