చిన్న పొరపాటు ఫలితంగా ఏళ్ల తరబడి ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణం కూడా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా పొరపాటు.. ఎక్కడ జరిగింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి వంటి వివరాలు..
తుర్క్మెనిస్తాన్ దేశంలో సుమారు 50 సవంత్సరా క్రితం అనగా 1971లో జరిగిన చిన్న పొరపాటు వల్ల సహజవాయువు బిలంలో నిత్యం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీన్ని గేట్ వే టూ హెల్ (నరక ద్వారం) అంటారు. నిత్యం మండుతుండటంతో ఆ ప్రాంత పర్యావరణం దెబ్బ తినడమే కాక జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అగ్ని బిలాన్ని ఆర్పడానికి ఏవైనా ఉపాయం చెప్పాలని ప్రజలను కోరారు.
Turkmenistan plans to close its ‘Gateway to Hell’. || VIDEOhttps://t.co/FjBUrxAfwZ#Turkmenistan #Gatewaytohell pic.twitter.com/F3DNHsNX76
— Achat (@AchatAchat) January 9, 2022
గతంలో అనగా 2010లో అధ్యక్షుడు ఇదే తరహా ప్రకటన చేశాడు. నిపుణలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొవాలని సూచించాడు. ఈ సందర్భంగా తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు బెర్డిముఖమెడోవ్ మాట్లాడుతూ.. ‘‘ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన బిలం. గత 50 ఏళ్లుగా ఈ బిలం మండుతుండటంతో.. ఎంతో విలువైన సహజ సంపదను కోల్పోయాము. ఈ సహజ వనరులను సరిగా వినియోగించుకోగలితే.. వాటి నుంచి వచ్చే లాభాలతో మన ప్రజల జీవితాలు ఎంతో అభివృద్ధి చెందేవి. ఇకనుంచైనా అలా వృథా కాకుండా ఉండాలంటే.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. దీని గురించి ఆలోచించండి’’అని కోరారు.
1971లో సోవియెట్ జియోలజిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా గ్యాస్ లీకైంది. ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది. దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియోలజిస్టులు.. గ్యాస్‌ను మండించారు. కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు. అయితే, 50 ఏళ్లు గడిచినా.. ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది.
‘దర్వాజా క్రేటర్’ అని పిలిచే ఈ ప్రాంతం క్రమేనా పర్యాటక స్థంగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోలు దిగుతుంటారు. నిత్యం గ్యాస్ మండటం వల్ల పర్యవరణానికి, ప్రజలకు హాని జరుగుతోందని.. ఈ బిలాన్ని మూసివేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే, 2010లోనే ఇక్కడి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ సాధ్యం కాలేదు. మరి ఈ సారైనా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి. ఈ బిలంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.