హైవేపై గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు! ఎగబడి ఏరుకున్న ప్రజలు!

Money In Roads California US

డబ్బు.. ఇది లేనిదే మానవ మనుగడే లేదని చెప్పక తప్పదు. ఇదే డబ్బు కోసం రాత్రి పగలు కష్టపడి ప్రతీ ఒక్కరు సంపాదిస్తుంటారు. ఇదిలా ఉంటే మనం రోడ్డుపై నడిచి వెళ్తున్న క్రమంలో రూ.100 కానీ 1000 నోటు ఒక్కటి దొరికినా ఆ రోజు మన ఆనందానికి అవదులు ఉండవు. కానీ ఓ దేశంలో హైవేపై ఏకంగా ట్రక్కులోంచి జారిపడిన సంచుల నుంచి కరెన్సీ నోట్లు నడి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులంతా ఎగబడి ఎగబడి ఏరుకున్నారు.

అసలు ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ ప్రశ్న. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కార్ల్స్‌బడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శాన్‌డిగో నుంచి ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి నగదు సంచులతో ట్రక్కు హైవేపై వెళ్తుండగా డోరు తెరుచుకోవడంతో డబ్బులు సంచులు రోడ్డుపై పడ్డాయి. దీంతో వెంటనే జనాలంతా పరుగెత్తి పరుగెత్తి ఏరుకున్నారు. ఇలా రోడ్డుపై డబ్బులను జనాలు ఎగబడి ఏరుకున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

ఇక దీనిపై స్పందించిన కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్‌ అధికారి కర్టిస్‌ మార్టిన్‌ మాట్లాడుతూ.. ట్రక్కు డోరు తెరుచుకోవడం కారణంగా నగదు సంచులు రోడ్డుపై పడ్డాయని దీంతో వెంటనే వాహనదారులంతా డబ్బులను తీసుకున్నారని తెలిపారు. ఇక ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. దీంతో పాటు నగుదును తీసుకున్న కొందరు వ్యక్తులు తిరిగి వెనక్కిచ్చేశారని అధికారులు తెలిపారు.

కాగా పోయిన నగదు ఎంత అనే దానిపై మాత్రం అధికారులు స్పష్టతనివ్వటం లేదు. ఇక ఈ ఘటనపై సీహెచ్‌పీ, ఎఫ్‌బీఐలు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఇక తాజాగా కాలిఫోర్నియా జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇలా రోడ్డుపై దొరికిన డబ్బును ఎగబడి ఏరుకున్న జనాల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by DEMI BAGBY (@demibagby)