ఆనందయ్య మందు దేవుడిచ్చిన వరం!?.

ఆనందయ్యకు రోజురోజుకూ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది.   ఇప్పటికే ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయనను ప్రశంసించారు.  ప్రముఖ మత గురువు కేఏ పాల్ కూడా ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు.  ఆనందయ్య కనిపెట్టిన ఆనందయ్య మందు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఆనందయ్యతో తాను కొన్ని గంటల క్రితమే మాట్లాడానని, ప్రస్తుతం ఆయన పోలీసుల వలయం ఉన్నారని చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయన్నారు. తన తల్లి ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందన్నారు. అందరినీ అనలేమని కానీ కొంతమంది దోచుకుతింటున్నారన్నారు. కరోనా ఉధృతికారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు.

Et2 2ywVoAIsB4e

ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలన్నారు. ఆయన ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని కోరారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయి. ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలన్నారు. ఆయన ఉన్న చోటికి లోకల్ చానల్స్ నుంచి జాతీయ మీడియా వరకు అందరూ వెళ్లి విచారణ జరపాలని కోరారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. తమ సంస్థ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. మందు తయారీకి కావలసిన మెటీరియల్స్ తెచ్చుకుంటే మందు తయారు చేసుకుని వెళ్లొచ్చన్నారు. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ అన్నారు.