False: ఇజ్రాయెల్లో కొత్త కరోనా వేరియంట్ ‘ఫ్లోరోనా’ కేసు నమోదు
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో మరో కొత్త వేరియంట్ ఒకటి ఇజ్రాయిల్ లో గుర్తించినట్లు.. దాని పేరు ‘ఫ్లొరోనా’గా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని సోర్సులను నమ్మి సుమన్ టీవీ డాట్ కామ్ కూడా ‘ఓమిక్రాన్ ని మించిన కొత్త వేరియంట్ గుర్తింపు!’ టైటిల్ తో ఆ వార్తను కవర్ చేయడం జరిగింది. కానీ, ఫ్యాక్ట్ చెక్ లో అది రూమర్ గా తేలింది. అలాంటి పుకారును వార్తగా ప్రచురించినందుకు చింతిస్తున్నాము. మా క్రెడిబిలిటీని దెబ్బతీసే అలాంటి వార్తలను ముందుముందు కూడా ప్రచురించమని తెలియజేస్తున్నాము. ప్రజలను, మా పాఠకులను భయభ్రాంతులకు గురి చేయాలన్నది మా ఉద్దేశం కాదు. అలాంటి పొరపాట్లు పునరావృతం చేయమని తెలియజేస్తున్నాం.
ఫ్లొరోనా అంటే ఏంటి?
ఇటీవల ఇజ్రాయిల్ లో ఓ గర్భిణీలో ఇన్ ఫ్లుయెంజా- కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన కండీషన్ కు ఫ్లొరోనా అంటూ పేరు పెట్టారు. కొవిడ్ 19- ఇన్ ఫ్లుయెంజా రెండూ శ్వాసకోశకు సంబంధించిన అంటు వ్యాధులే, కానీ వాటికి సంబంధించిన వైరస్ లు వేరు. ఈ రెండు వ్యాధులకు సంబంధించిన చికిత్స, టీకాలు వేరుగా ఉంటాయి. కరోనా, ఇన్ ఫ్లుయెంజా రెండూ సోకిన వ్యక్తి వాటికి సంబంధించిన రెండు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది.