న్యూజిలాండ్‌‌‌‌లో పోలీస్‌‌‌‌గా తొలి భారతీయ మహిళ – రమణ్‌‌‌‌దీప్‌‌‌‌కౌర్‌‌‌‌‌‌‌‌ సంధు

నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్వేషణలో వచ్చే అవకాశాలను యువత అంది పుచ్చుకోవాలి. లక్ష్యాలను ఎంపిక చేసుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలి. అలా ఆశయసిద్ధి ఉండబట్టే న్యూజిలాండ్‌‌‌‌లో మన దేశానికి చెందిన అమ్మాయి ఓ అరుదైన ఘనత సాధించింది. రమణ్‌‌‌‌దీప్‌‌‌‌కౌర్‌‌‌‌‌‌‌‌ సంధు అనే అమ్మాయి న్యూజిలాండ్‌‌‌‌లో పోలీస్‌‌‌‌గా ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సంధు పుట్టి, పెరిగిందంతా పంజాబ్లోనే. చదువు కూడా ఇక్కడే పూర్తి చేసింది. అయితే, 2012లో న్యూజిలాండ్‌‌‌‌లోని హ్యాక్స్‌‌‌‌ బే ప్రాంతానికి వెళ్లాక, కొంతకాలం రకరకాల జాబ్స్‌‌‌‌ చేసింది. అలాగే స్థానిక కల్చర్‌‌‌‌‌‌‌‌, ప్రజల గురించి కూడా బాగా తెలుసుకుంది. అయితే, తనకిష్టమైన పోలీస్‌‌‌‌ జాబ్‌‌‌‌ చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసింది.

637514455929510749RT

పోలీస్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌పై ఉన్న ఇంట్రెస్ట్ ఆమెను పోలీస్‌‌‌‌జాబ్ వైపు వెళ్లేలా చేసింది. న్యూజిలాండ్‌‌‌‌లో పోలీస్‌‌‌‌ జాబ్‌‌‌‌ చేయాలంటే మనలాగే ఎంట్రన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ రాసి, ఫిజికల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ పాసవ్వాలి. అన్నింట్లోనూ అర్హత సాధిస్తే, పోలీస్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ చేస్తారు. ఈ ట్రైనింగ్‌‌‌‌ పీరియడ్ని పోలీస్‌‌‌‌ గ్రాడ్యుయేషన్‌‌‌‌గా పిలుస్తారు. ఇందులో పాస్‌‌‌‌ అయి, అర్హత సాధిస్తే పోలీస్‌‌‌‌గా ఎంపిక చేస్తారు. సంధు ఈమధ్యే సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ట్రైనింగ్‌‌‌‌ ఫినిష్‌‌‌‌ చేసుకుని, పోలీస్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌గా మారింది. తొలిసారి మన దేశం నుంచి అక్కడి పోలీస్‌‌‌‌గా ఎంపికైంది. దాంతో పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సంధుకి గ్రాండ్ వెల్కమ్‌‌‌‌ చెప్పింది. పోలీస్‌‌‌‌ అవ్వాలనుకున్నప్పుడు హెల్ప్‌‌‌‌ చేసేవాళ్లు ఎవరూ లేరు. మన దేశం నుంచి ఒక్క మహిళ కూడా న్యూజిలాండ్ పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చేరలేదు. దీంతో ఎవరి సాయం తీసుకోవాలో తెలియలేదు. అయితే, స్థానికంగా ఉండే ‘ఈస్టర్న్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టెక్నాలజీ’ సాయంతో ఇందులో చేరానని చెప్పింది సంధు.