గత కొన్ని రోజులుగా అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ లో వరుసగా భూకంపాలు సంబవిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 255 మంది మృతిచెందినట్లు అఫ్గాన్ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. వందల మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..
అఫ్గనిస్థాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 255 మంది మృతిచెందగా, మరో 1,250 మంది గాయపడ్డారని అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అఫ్గనిస్థాన్ లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకం కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. భూకంప తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల కిందే చిక్కుకుని అనేక మంది మరణించారు. భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.
ఇక, పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా పాకిస్థాన్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని, భయంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గత శుక్రవారం ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్‌తో సహా పలు నగరాల్లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. తాజా భూకంపంతో అఫ్గన్, పాకిస్థాన్ దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
UPDATE | An earthquake struck eastern Afghanistan early Wednesday, killing at least 255 people, authorities said: The Associated Press
— ANI (@ANI) June 22, 2022