డేంజ‌ర‌స్ స్పైడ‌ర్‌తో చిన్నారి ఆట.. అంతలోనే.. వీడియో వైరల్!

చిన్న పిల్లలకు ప్రతిదీ ఆటవస్తువుగానే భావిస్తారు.. కొన్ని సార్లు వాటితో అపాయం అన్న సంగతి వారికి తెలియదు.. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని పెద్దలు అంటుంటారు. సాధారణంగా మన ఇండ్లలో సాలె పురుగులు(స్పైడర్) చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. వాటితో పెద్దగా అపాయం కూడా ఉండదని తెలిసిందే.

ppegqjఇక సాలీడులో చాలా ర‌కాల జాతులు ఉంటాయి. ఆఫ్రికా అడవుల్లో సాలె పురుగులు చాలా పెద్దవిగా విషపూరితమైనవి ఉంటాయి. అలాంటివి ఎక్కువగా జియోగ్రాఫిక్ ఛానల్స్ లో చూపిస్తుంటారు. అయితే చిన్నవిగా ఉన్నా కొన్ని స్పైడర్స్ విషపూరితమైనవి గా ఉంటాయి. అటువంటి వాటిలో టారంటులా అనే జాతికి చెందిన స్పైడ‌ర్ ఒకటి. ఇవి ఎక్కువ‌గా అమెరికాలో క‌నిపిస్తాయి.

spagaeఅయితే ఓ చిన్నారి దాని గురించి తెలియక ఆట‌లు ఆడుతుండ‌గా.. అది తిన్న‌గా ఆ చిన్నారి భుజాల మీదికి ఎక్కింది. అంతలోనే అక్కడికి పాప తండ్రి వచ్చి వెంటనే స్పైడర్ ని పక్కకు తొలగించి పాపను ఎత్తుకుని పక్కకు జరిగాడు. ఒకవేళ అది పాపను కుట్టి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. ఈ ఘ‌ట‌న త‌న ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.