సెకండ్ వేవ్ – యువతే కరోనా టార్గెట్!?.

రోజురోజుకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రజలు ప్రస్తుతం సెకండ్ తో చెప్పుకోలేని బాధలో పడిపోతున్నారు. ఓవైపు వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలమీదికి తెస్తుందో అని భయం., మరోవైపు వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే మళ్ళీ లాక్ డౌన్ తో దుర్భర స్థితికి వెళ్ళిపోతామేమో అని రోజురోజుకు ప్రజలందరిలో ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది. దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో యువతే ఎక్కువ దాని బారిన పడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధిపతి డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. దానికి రెండు ప్రధాన కారణాలని వివరించారు. యువత బయట తిరగడం ఒక కారణమైతే, భారత్ లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ కరోనా మరో కారణమని చెప్పారు.

GlobalYouthDevelopmentIndex620

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ల మధ్య కరోనా కేసులను పోల్చి చూస్తే వయసు వ్యత్యాసం పెద్దగా లేదని, అయితే, పెద్దవయసు వారితో పోలిస్తే యువతలో కరోనా వ్యాప్తి కొంచెం ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. 40 ఏళ్లుపైబడిన వారు మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వైరస్ సోకిన తమకు ఏమీ కాదు అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ సెకండ్ వేవ్ లో 100 శాతం కేసుల్లో 43.2 శాతం యువతే వున్నారు అన్నది తాజాగా వెల్లడైంది. దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. మాకేం కాదులే అని నిర్లక్ష్యమే యువతను చివరికి రోగులు గా మార్చి హాస్పిటల్ బెడ్ కి పరిమితం చేస్తుంది అని చెబుతున్నారు అంతేకాకుండా యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా చిన్న పిల్లలకు వృద్ధులకు కరోనా వైరస్ సోకి చివరికి ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి అంటూ హెచ్చరిస్తున్నారు.