వివాదాలు C/o డైరీ మిల్క్ చాక్లెట్!..

చాలామంది క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలు ఈ చాక్లెట్లను ఎంతో ఇష్టపడతారు. అయితే ఈ సంస్థ ఇప్పుడో  వివాదంలో ఇరుక్కుంది. క్యాడ్‌బరీ చాక్లెట్లలో గొడ్డుమాంసం నుంచి తయారయ్యే జెలాటిన్ వాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే ఓ పోస్టు క్యాడ్‌బరీ వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది.

Dairy Milk minదీంతో ఇది నిజమేనా అని క్యాడ్‌బరీ సంస్థను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతే కాదు ఇదే కనుక నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రోడక్ట్ ను హిందువులచే బలవంతంగా తినిపించి నందుకు క్యాడ్బరీ సంస్థపై కేసు పెడతానంటూ  నెటిజెన్ ట్వీట్ చేశాడు. ఈ వివాదంపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ స్పందించి గొడ్డు మాసం పై క్లారిటీనిస్తూ  ప్రకటన చేసింది. భారత్ లో తయారువుతున్న , అమ్ముతున్న మాండెలెజ్ – క్యాడ్‌బరీ ఉత్పత్తులు 100 శాతం వెజిటేరియన్ అని తెలిపింది.

అంతేకాదు వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్  క్యాడ్‌బరీ భారతీయ ఉత్పత్తులకు సంబంధించినది కాదని తెలిపింది. క్యాడ్‌బరీ చాక్లెట్ ర్యాపర్‌పై ఉన్న ఆకుపచ్చ చుక్క శాఖాహారం అన్న విషయాన్ని సూచిస్తుందని వెల్లడించింది. ఈ స్క్రీన్ షాట్ ని షేర్ చేసేముందు ఒకసారి నిజాలు ఏంటో తెలుసుకోవాలని వినియోగదారులకు క్యాడ్ బరి డైరీ మిల్స్ సూచించింది.

క్యాడ్ బరీ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలంటూ వందలాది మంది ట్విట్టర్ యూజర్లు పిలుపునివ్వడంతో క్యాడ్ బరీ సంస్థ స్పందించింది. ఈ వివరణతో అయినా వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.