చైనాలో తొలిసారిగా మనిషికీ బర్డ్ ఫ్లూ!… మరో కరాళ నృత్యం?!.

బర్డ్ ఫ్లూ విజృంభణ మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చాలా కాలం నుంచి ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చైనాలో అదే నిజ‌మైంది. వివిధ రాష్ట్రాల్లో పక్షులు, కోళ్లు, బాతులు చనిపోవడంతో బర్డ్‌ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది పక్షుల్లో వ్యాపించే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి ప్రధానంగా H5N1 వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల ద్వారా ఈ వైరస్ మనుషులకు, జంతువులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు. కానీ దీని వల్ల కొత్త వైరస్ స్ట్రెయిన్ మనుషుల్లో అభివృద్ధి చెంది, అవి మనుషులకూ వ్యాపించే అవకాశాలు లేకపోలేదు.

H10N3 bird flu

చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్య‌క్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందని ఆ దేశ‌ జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) విభాగం వారం రోజుల క్రితం అత‌డికి రక్త పరీక్షలు చేయగా బర్డ్‌ ఫ్లూ సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యిందని వివ‌రించింది. అత‌డిలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందని ప్ర‌క‌ట‌న రావ‌డంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. బాధితుడికి ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించి తినాలి. మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ వ్యాధుల లక్షణాల మాదిరిగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, ముక్కు కారటం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు వంటివి కనిపిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి.