కూతురు ప్రేమలో పడిందని.. చరిత్రలో చూడని 25 ఏళ్ల తల్లి శిక్ష..!

love

తమ కూతుళ్ల ప్రేమలను చాలా మంది తల్లీదండ్రులు అంగీకరించరనే చెప్పాలి. దీని కారణంగా ఎంతోమంది ప్రేమ జంటలు చివరికి ఆత్మహత్య చేసుకోవటం జరుగుతోంది. సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలు నేటికి ఎన్నో జరుగుతుండటం విశేషం. అయితే ఓ తల్లి మాత్రం కన్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకుని చరిత్రలో చూడని, వినని శిక్షను వింధించింది. అయితే ఈ ప్రేమ కథ ఇప్పడు జరిగిందనుకుంటే పొరపాటే.

ఈ ఘటన 19వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1876వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లో మేడమ్ మోనియర్ ప్రేమగా పెంచుకున్న కూతురు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. అయితే తన కూతురు బ్లాంచే మోనియర్ మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో కొన్నాళ్లకు తన ప్రేమ విషయాన్ని తల్లి మేడమ్ మోనియర్ కు వివరించింది. ఈ విషయం తెలిసి తల్లి మేడమ్ మోనియర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. ప్రాణంగా పెంచుకున్న కూతురుని ధనవంతుడికి ఇచ్చి ఘనంగా వివాహం చేయాలని కలలు కంటూ ఉంది.

blanche monnierఇంతలోనే తన కూతురు చేసిన పనిని జీర్ణీంచుకోలేక బంధించి ఓ చికటి గదిలో గొలుసులతో కట్టిపడేసింది. అప్పటికి తన కూతురి వయసు 25 ఏళ్లు. రోజు ఆహారం పంపాలనుకుంటే పని వాళ్ల సాయంతో బెడ్ వద్దకు విసిరేసేవారు. ఇక గొలుసులతో కట్టేయటంతో మల, మూత్ర విసర్జన కూడా అక్కడే చేయాల్సి వచ్చేది. అలా భరించలేని వేదనతో అరుస్తూ, ఏడుస్తూ ఉండేది. అలా బతికుండగానే నరకాన్ని చూసి దారుణమైన జీవితాన్ని గడిపింది బ్లాంచే మోనియర్. దీంతో దుఖంతో తిండి తినకపోవటంతో చివరికి బక్కచిక్కిపోయింది. ప్రతి రోజు అరుస్తుండటంతో ఇరుగుపొరుగు వారు తల్లిని అడిగితే తన కూతురికి పిచ్చి పట్టిందంటూ ఊరంతా చెప్పుకొచ్చింది.

blanche monnierదీంతో అలా 25 తన కూతురుని 25 ఏళ్ల పాటు ఆ చికటి గదిలో బంధీగా ఉంచి దుర్మార్గురాలిగా పేరుకెక్కింది ఈ తల్లి. ఇక 25 ఏళ్ల చికటి జీవితం తర్వాత 1901 మే 23న పారిస్ అటార్నీ జనరల్‌కు ఓ యువతి 25 ఏళ్లుగా చికటి గదిలో బంధీగా ఉంటుందని ఓ రహస్య లేఖ వెళ్లింది. దీంతో వెంటనే సమాచారం పోలీసులకు వెళ్లింది. స్పందించిన పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి బంధీగా ఉన్న బ్లాంచే మోనియర్ ఇక ఎట్టకేలకు రక్షించారు. అనంతరం నిందితులైన తల్లిని, కుమారుడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా కన్న కూతురు ప్రేమించిన పాపానికి అనుభవించిన శిక్ష పట్ల అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా చర్చనియాంశం అయింది. ఇక కొన్నాళ్లు బతికిన బ్లాంచే మోనియర్ 1913లో చనిపోయింది. కూతురు ప్రేమించినందుకు చరిత్ర పేజీల్లో చదవని శిక్ష తల్లి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.