అదృష్టం కలిసి వచ్చిన వ్యక్తికి రాయే రత్నం అయ్యింది

rock

ఓ సినిమాలో నటుడు ఆలీ కోసం లక్ష్మీదేవి ఓ డబ్బుల సంచిని వేస్తే.. అప్పుడు దాకా కళ్లు తెరిచి నడిచిన అతను.. కళ్లు మూసుకుని నడవడం మొదలు పెడతాడు. ఆ డబ్బు సంచి కోల్పోతాడు. అంతే కొందరికి అదృష్టం ఆమడ దూరంలో ఉంటే.. దరిద్రం మాత్రం జేబులోనే ఉంటుంది. కొందరికి మాత్రం వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇదిగో ఈ డేవిడ్‌ లాగా అనమాట.

rockవివరాల్లోకి వెళ్తే… ఆస్ర్టేలియాలోని మెల్ బోర్న్ కు చెందిన డేవిడ్ హాల్ స్థానికంగా ఉన్న పార్కులో తిరుగుతుంటాడు. అలా ఒకసారి నడిచే సమయంలో డేవిడ్ కాలికి ఓ రాయి తగిలింది. నేలపైన ఆ రాయి కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. కానీ చూడటానికి అది కొంత విచిత్రంగా కనిపించింది. దీంతో తవ్వి పూర్తి రాయిని బయటకు తీశాడు. ఆ రాయి బరువు 17 కిలోలు ఉంది. అప్పటినుంచి అది బంగారమై ఉంటుందని తన ఇంట్లోనే భద్రపరిచాడు. అది కేవలం రాయేనని ఇంట్లో వద్దు బయటపడేయమని చాలా మంది సలహాలు ఇచ్చారు. అది విలువైన వస్తువువే అని డేవిడ్ బలంగా నమ్మాడు. తనకు దొరికిన రాయిని పగలగొట్టడానికి డ్రిల్ మిషన్‌ సహా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయిన దాన్ని పగలకొట్ట లేకపోయాడు. దాని రహ్యసం కనిపెట్టలేకపోయాడు. చివరకి చేసేదిలేక ఆ రాయిని తీసుకుని మెల్‌ బోర్న్‌ లోని మ్యూజియానికి తీసుకెళ్లాడు. అక్కడున్న జియాలజిస్ట్ లు  పరిశీలించి.. ఆ రాయి గురించి విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు.

అవును.. అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ అరుదైన ఉల్క అంట. ఇది సుమారు 460 కోట్ల సంవత్సరాల నాటిదంట. ఈ రాయి విలువ కొన్ని కోట్లు ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న డేవిడ్ ఎగిరి గంతేశాడు. డేవిడ్ ఆ రాయితో ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. ఆ పార్కు నుంచి 19వ శతాబ్ధానికి చెందిన అనేక బంగారం రాళ్లు మ్యూజియానికి తీసుకురాబడ్డాయి. దీంతో ఆ పార్కులో బంగారం దొరుకుతుందని అక్కడి స్థానికుల్లో నమ్మకం ఏర్పడింది.