రూ.22 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ – 62,400 మంది దాతలు సహకారం!..

చందానగర్‌కు చెందిన  సాఫ్ట్‌వేర్‌ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్‌ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం   పీడియాట్రిక్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ కోణంకికి చూపించారు.   వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్‌ మసు్కలర్‌ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు.  చికిత్స  చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్‌లైన్‌ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్‌ గురు స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు.  ఆన్‌లైన్‌ వేదికగా దాతలను అభ్యర్ధిచారు.  దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, దాతలు పునర్జన్మను ప్రసాదించారు.

Childrens treatment

మూడేళ్ల బాలున్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా 62,400 మంది దాతలు చేయూతను అందించారు. ఇంపాక్ట్‌ గురు సంస్థ ఆన్‌లైన్‌ వేదికగా గత ఏడాది కాలంగా క్రౌడ్‌ ఫండింగ్‌ నిర్వహించి రూ.16 కోట్లు సమకూర్చింది. సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్‌   అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దాతల నుంచి సేకరించిన రూ.16 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసిన ఈ మందును బాలునికి ఇచ్చి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చారు.

ప్రస్తుతం బాలుడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే తరహా వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లలకు ఇప్పటికే ఇదే ఆస్పత్రి లో విజయవంతంగా వైద్యం చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఆ తల్లిదండ్రులు పడిన నరకానికి ఆ రోజుతో ఫుల్‌స్టాప్‌ పడింది. అయాన్ష్‌ను మరో మూడు నెలలపాటు జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు వారికి సూచించారు.