రెండేళ్లుగా వాళ్లు మోసం చేస్తున్నారు.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన స్నేహ

చెన్నై- స్నేహ.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దివంగత నటి సౌందర్య తరువాత అంతటి పేరు తెచ్చుకుంది స్నేహ. సౌందర్య లాగే గ్లామర్ షోకి దూరంగా ఉంటూ, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుని, దక్షిణాది భాషలన్నింటిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది స్నేహ.

తెలుగులో ఐతే దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది స్నేహ. ప్రముఖ సనీ నటుడు ప్రసన్నని స్నేహ ప్రేమ పెళ్లి చేసుకుని చెన్నైలో నివసిస్తోంది. ఇక ఇప్పుడు దాదాపు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే బిజీగా ఉంది. స్నేహ, ప్రసన్న దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా ఆమె జీవితం హ్యాపీగా సాగిపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా స్నేహకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యాపారవేత్తలు స్నేహని నమ్మించి మోసం చేశారట.

Actress Sneha

వారి వల్ల స్నేహ ఆర్ధికపరమైన ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో స్నేహ ఈ వ్యాపారులిద్దరిపై చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో ఈ వ్యాపురల గురించి స్నేహ సంచలన విషయాలు పేర్కొంంది. సదరు వ్యాపారులిద్దరు చెన్నైలో ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారట. గత రెండేల్లుగా స్నేహ ఈ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెడుతూ వస్తోందట. స్నేహ చెల్లించిన డబ్బుకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

సదరు కంపెనీలో స్నేహ ఇప్పటివరకు 26 లక్షలు ఇన్వెస్ట్ చేసిందట. ఐతే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తనకి రిటర్న్స్ ఇవ్వలేదని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది స్వేహ. తన దగ్గర తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని స్నేహ అడిగితే, ఆ ఇద్దరు వ్యాపవేత్తలు తనను బెదిరిస్తున్నారని ఆమె వాపోయంది. స్నేహ పిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.