మోసం చేసింది ఎప్పుడూ బాగుపడదు, ఆసక్తిరేపుతున్న సిద్దార్ధ్ కొటేషన్

ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు చర్చ అంతా నాగచైతన్య, సమంతల విడాకుల గురించే. అవును వాళ్లిద్దరు విడిపోతున్నట్లు అధికారికరంగా ప్రకటంచిన తరువాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి మొదలు అభిమానుల వరకు రకరకాల వాదనలు చేస్తున్నారు. నాగచైతన్య, సమంతల విడాకులకు గల కారణాలను ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు.

సమంత, చైతన్య విడాకుల వ్యవహారంపై అక్కినేని నాగార్జున సైతం స్పందించాడు. భార్య భర్తల మధ్య జరిగింది పర్సనల్ అని, విడాకుల కారణాలను చెప్పకనే చెప్పేశారాయన. వీళ్లిద్దరి విడాకుల ఇష్యూ పై రాంగోపాల్ వర్మ, కస్తూరి శంకర్, కుష్బూ వంటి వారు స్పందించారు. అయితే తాజాగా హీరో సిద్దార్థ్ చేసిన ఓ కామెంట్ మాత్రం అందరినీ ఆలోచనల్లో పడేసింది. తాను మొదటి సారిగా స్కూల్‌లో నేర్చుకున్న గుణపాఠం ఇదేనంటూ చెప్పుకొచ్చారు సిధ్దార్ధ్.

Samantha 2

మోసం ఛేసింది ఎప్పటికీ బాగుపడదు అని సిద్దార్థ్ ఓ కొటేషన్‌ ను షేర్ చేస్తూ అసలు చీటర్ ఎవరు అనేలా సిద్దార్థ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు సైతం సిద్దార్థ్ ట్వీట్‌ కు అర్ధాన్ని వెతికే పనిలో పడ్డారు. ఇది ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందబ్బా అని అంతా ఆలోచిస్తున్నారు. కొంపదీసి సమంత మీద సిధ్దార్ధ్ సెటైర్లు వేశాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

నాగచైతన్య, సమంతలు విడిపోతున్నాం అని అధికారికంగా చెప్పిన కాసేపటికే సిద్దార్ధ్ ఇలాంటి కొటెషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో, ఖచ్చితంగా సమంత-నాగచైతన్య ను ఉద్దేశించి పెట్టిందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇంతకు సిద్దార్థ్ చెప్పినట్లుగా వీరిద్దరిలో చీటర్ సమంతనా లేక నాగచైతన్య అంటూ గుసుగుసలాడుకుంటున్నారు. ఇక వీరిద్దరిలో చీటర్ ఎవరనేదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.