ఈరోజు హైదరాబాద్ లో తగ్గిన బంగారం, స్వల్పంగా పెరిగిన వెండి

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 160 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,200.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,130.
1కిలో వెండి 64,700

బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 16 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గి 43 వేల 200 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 160 రూపాయలు తగ్గి 47 వేల 130 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 300 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 64 వేల 700 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 200 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 230 రూపాయలు తగ్గింది.

gold 1 4

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 550 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,510 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,290 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,290 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,500 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 49,640 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.