కారు కోసం పర్వతంపై తపస్సు.. 33 రోజుల తరువాత

car

ఇంటర్నేషనల్ డెస్క్- కారు.. ఒకప్పుడు విలాసవంతంమైన వస్తువు. అంతే కాదు కారు అప్పట్లో స్టేటస్ సింబల్ కూడా. కానీ ఇప్పుడు కారు అందరికి అవసరం. నిత్య జీవితంలో కారు ఓ బాగం అయిపోయింది. సామాన్య మధ్య తరగతి వాళ్లు కూడా ఇప్పుడు కారు కొనుక్కుంటున్నారు. ఇక కారు కొనుక్కోవాలన్న ఆశ అందరిలోను ఉంటుంది. తమ తమ స్థోమతను బట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది లోన్ తీసుకుని కారు కొనుక్కుంటున్నారు. ఐతే చాలా మందికి ఖరీదైన కారు కావాలన్న ఆశ ఉంటుంది. కానీ వాటికి కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్తోమత మాత్రం ఉండదు. దీంతో ఖరీదైన కారు చాలా మందికి ఆశగానే మిగిలిపోతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం తాను ఖరీదైన స్పోర్స్ట్ కారు కొనక్కర్లేదు, తనకు దేవుడే కారు ఇస్తాడని చెబుతున్నాడు. దేవుడేంటీ, కారు ఇవ్వడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే మనం కాసేపు జింబాబ్యే కు వెళ్లాల్సిందే.

fasting

జింబాబ్వేలో నివసించే మార్క్ మార్దాజిరా రిసెన్ సైంట్స్ చర్చ్‌కు నాయకుడు. ఇతనికి చాలా రోజులుగా ఖరీదైన స్పోర్ట్స్ కారు లంబోర్ఘిని కొనాలన్న కోరిక ఉంది. కానీ అంత డబ్బు పెట్టి కారు కొనే స్థోమత మాత్రం మార్దాజీరా కు లేదు. తన కోరికను కేవలం దేవుడు మాత్రమే తీర్చగలడని అతని బలమైన నమ్మకం. ఈ నేపధ్యంలో మార్దాజీరా రిసెన్ తన కారు భారం దెవుడిపైనే వేశాడు. అంతే కాదు దేవుడి కరుణ కోసం 40 రోజులు కఠిన ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని తెలుసుకుని చాలా మంది వారించారు. దేవుడు ఇలా కార్లు అవి ఇవ్వడని, కావాలంటే నీవు డబ్బు సంపాదించి కొనుక్కోమని సలహా ఇచ్చారు. కానీ తనకు దెవుడు తప్పకుండా కారు ఇస్తాడని మార్దాజీరా వాదించాడు. అనుకున్నదే తడవుగా ఉపవాస దీక్ష కోసం దగ్గర్లోని పర్వతంపైకి వెళ్లిపోయాడు. మన పురాణాల్లో రుషుల తపస్సు చేసినవిదంగా ఒంటరిగా తప్పస్సు చేయడం మొదలుపెట్టాడు.

అలా 33 రోజులు గడిచినా అతని తపస్సు మాత్రం ఫలించలేదు. కానీ ఉపవాస దీక్ష వల్ల అతడు బాగా నిరసించిపోయాడు. తీవ్ర అనారోగ్యం చేయడంతో అతను కనీసం కదల్లేని పరిస్థితికి వచ్చాడు. అతని స్నేహితులు మార్దాజీరా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను వెళ్లిన పర్వతంపై వెతకగా చివరికి 33వ రోజు ఓ చెట్టు కింద పడిపోయి ఉన్నాడు. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివరికి అతను రెండు రోజుల తరువాత కోలుకున్నాడు. అయినప్పటికీ తనకు దేవుడు కారును ఖచ్చితంగా ఇస్తాడన్న ఆశతో ఉన్నాడట మార్దాజీరా. దీంతో ఇక ఎవరు ఏంచేయలేరని స్నేహితులు వాపోయారు. అన్నట్లు మార్దాజీరా కావాలనుకుంటున్న కారు లాంబోర్గినీ ఖరీదు ఎంతో తెలుసా అక్షరాల 1 కోటీ 45 లక్షల రూపాయలు.