ఏడు నెలల గర్భాన్ని తనకు తానే అబార్షన్ చేసుకున్న యువతి..!

Self Abortion

వయసులో ఉన్న యువతీ యువకులు ప్రేమలో పడటం, ఆపై శారీరకంగా కలుసుకోవటం, ఆ తర్వాత గర్భం దాల్చటం. తదనంతరం విషయం బయటకు పొక్కకుండా యువతులు అబార్షన్ చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇలా ఎంతో మంది యువతులు చేస్తున్న పొరపాటే ఇది. కానీ మహారాష్ట్రలో మాత్రం తనకు తానే అబార్షన్ చేసుకుని సరికొత్త ప్రయోగానికి తెరతీసిం బొక్కబోర్లాపడ్డ యువతి.

పూర్తి వివరాల్లోకి వెళ్లే.. మహారాష్ట్రలో నాగపూర్‎ కి చెందిన ఓ యువతి పెళ్లైన యువకుడితో 2016 నుంచి ప్రేమలో మునిగి తేలింది. దీంతో ఇద్దరు ఇష్టాల కారణంగా శారీరకంగా కూడా కలుసుకున్నారు. ఇక పెళ్లిచేసుకోవాలని ఆ యువతి ఎంత మొత్తకున్న ఆ వ్యక్తి నిరాకరించాడు. దీంతో కొన్నాళ్లకు ఆ యువతి గర్భవతి అని తెలింది. ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి యువతిని అబార్షన్ చేసుకోవాలని పట్టుబట్టాడు. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక తనలో తాను కమిలిపోతూ ఉంది. అబార్షన్ చేసుకోవాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని.

Self Abortionదీంతో ఆ యువతికి ఓ ఆలోచన వెలిగింది. యూట్యూబ్ లో అబార్షన్ చేసే వీడియోలు చూసింది. ఇక తనకు తానే అబార్షన్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అదే పనిగా అనుకున్నట్టుగానే సోషల్ మీడియాలో చూసి అబార్షన్ చేసుకుంది. కానీ ఆ ప్రయత్నం విఫలమవ్వటంతో పాటు శరీరమంత ఇన్ఫెక్షన్ సోకింది. యువతి అనారోగ్యంగా కనిపించటంతో అసలు మ్యాటర్ తల్లిదండ్రుల వరకూ వెళ్లింది. దీంతో వెంటనే యువతిని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక బాధితురాలి ఇచ్చిన సమాచారం మేరకు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన సోహెల్ వాహబ్ ఖాన్‎ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. యువతి తనకు తానే చేసుకున్న అబార్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.