ప్రియురాలు ఒప్పుకోలేదని..పీక కోసి పరారైన యువకుడు

dead

సూర్యపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నేరుడుచర్లలో సంచారి జాతికి చెందిన ఓ యువతిని బాల సైదులు అనే యువకుడు కత్తితో దారుణంగా గొంతు కోసి పరారయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంత కాలం నుంచి బాల సైదులు అనే యువకుడు స్థానికంగా నివాసం ఉంటున్నాడు. కాగా స్థానికంగా ఉండే సంచార జాతికి చెందిన ఓ యువతిని ప్రేమించాలని వెంటపడుతుండేవాడు.. దీంతో ఆ యువతికి సైదులు వ్యవహారం నచ్చకపోవటంవతో పలుమార్లు హెచ్చరించే ప్రయత్నం చేసింది.

అయినా వినని సైదులు ఎలాగైనా ఆ యువతిని లొంగదీసుకువాలని భావించి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సైదులు కోపంతో ఆ యువతిని మాట్లాడాలని ఓ చోటకు రమ్మన్నాడు. చివరికి ఆ దుర్మార్గుడి వేధింపులు భరించలేక అతను రావాలన్న చోటకు వెళ్లింది. సైదులు మాత్రం ఆ యువతిని చంపాలని నిర్ణయం తీసుకుని తన వెంట ఓ కత్తిని తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక కాసేపు ఇద్దరి మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇక ఆగ్రహానికి గురైన సైదులు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆ యువతిని వెంటనే మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.