తాపి పనోడితో బీ.ఈడీ చదవిన అమ్మాయి లవ్వాట.. జిరాక్స్ తీసుకొస్తానంటూ వెళ్లి..!

lovers

ప్రేమ గుడ్డిది అని అందరూ అంటుంటే నమ్మకతప్పదేమో అని అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో యువతి యువకులు వావివరసలు మరిచి ప్రేమ అంటూ తిరుగుతున్నారు. ఇక విషయం ఏంటంటే..? ఒడిశాలోని గంజాం జిల్లాలోని ఓ గ్రామంలో ఓ యువకుడు తాపి పని చేస్తున్న జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూతురితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది.

ఇక ఒకరినొకరు అర్ధం చేసుకుని ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఆ అమ్మాయి బీ.ఈడీ చదివివ ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ యువకుడితో పరిచయంతో ప్రేమలో మునిగితేలింది. ఈ మద్యకాలంలో జిరాక్స్ తీసుకొస్తానంటూ తల్లికి చెప్పి బయటకి వెళ్లిన కూతురు రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఇక తల్లిదండ్రులకు ఆ యువకుడి మీద కాస్త అనుమానం ఉండి బలవంతంగా కిడ్నాప్ చేశాడేమోనని అందరూ భావించారు.

loversకానీ ఇది కాకుండా ఆ యువతి ఆ యువకుడితో ఇష్టపడే వెళ్లానంటూ తల్లిదండ్రులకు ఓ వీడియోను పంపడంతో తల్లిదండ్రులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు. ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వాళ్లిద్దరిని స్టేషన్ కి పిలిపించారు. ఇక స్టేషన్ వచ్చాకా వారు పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తో సహా వచ్చారు. వారు మేజర్లని చట్టం ప్రకారమే వారు పెళ్లి చేసుకున్నారని, మేము ఏం చేయలేమంటూ పోలీసులు కూడా చేతులెత్తాశారు. దీంతో ఖంగుతిన్న తల్లిదండ్రులు చివరికి పోలీసుల కౌన్సిలింగ్ తో వీరి పెళ్లకి ఒప్పుకున్నారు.