ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురు గుట్టు రట్టు అయ్యింది. ఈ నిత్య పెళ్లి కూతురు ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా తొమ్మిది మందిని పెళ్లాడింది. మహబూబాబాద్‌లో కి చెందిన ఈ నిత్య పెళ్లి కూతురు బండారం తొమ్మిదో భర్త బయట పెట్టాడు. వివరాల్లోకి వెళితే..
వెంకటేశ్ అనే వ్యక్తికి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న ఓ మ్యాట్రిమోని వెబ్ సైట్ లో పరిచయం ఏర్పడింది. ఫోన్ నెంబర్లు తీసుకొని ఇరువురు మాట్లాడుకున్నారు. బెంగుళూర్ లో వెంకటేశ్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి మద్య ఏర్పడిన ఫోన్ స్నేహం తర్వాత ప్రేమగా మారి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. బెంగుళూర్ లో కాపురం పెట్టిన ఈ జంట మద్య కొద్ది రోజుల తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చాయి.
స్వప్న తరుచూ ఫోన్‌లో కోర్టు విషయాల గురించి మాట్లాడుతూ ఉండేదని.. ఏంటని ప్రశ్నిస్తే గొడవ పెట్టుకునేదని వెంకటేశ్ చెబుతున్నాడు. ఒకరోజు తనకు హైదరాబాద్ లో పని ఉందని వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ వెళ్లాలని అనడంతో వెంకటేశ్ కి అనుమానం వచ్చింది. ఈ విషయంపై కూపీ లాగడం మొదలు పెట్టిన ఆయనకు అసలు విషయం తెలిసిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యింది. స్వప్పకు తనకంటే ముందు ఎనిమిది మందితో వివాహం జరిగిందన్న విషయం తెలుసుకున్న వెంకటేశ్ ఒక్కసారే షాక్ కి గురయ్యాడు.
ఇక ఆమెతో తాను కాపురం చేయలని అని విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అందుకు ఆమె మాత్రం ఒప్పుకోలేదు.. పైగా అతనిపై లేని పోని ఆరోపణలు చేస్తూ వచ్చింది. అంతేకాదు వెంకటేశ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఫిర్యాదులో వెంకటేశ్ తనకంటే ముందు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడని.. తనకు మాయ మాటలు చెప్పి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.
ఇదిలా ఉంటే వెంకటేశ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో స్వప్న ఎనిమింది మందిని పెళ్లి చేసుకొని మోసం చేసిందని.. తాను తొమ్మిదవ భర్త అని తెలిసిన తర్వాత తన నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు.. ఆమెకు సంబంధించిన సాక్ష్యాధారాలు పోలీసులకు సమర్పించాడు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.