రౌడీలను గ్రౌండ్ లో నిలబెట్టి బెండు తీసిన మహిళా ఏసీపీ.. వీడియో వైరల్

Vijayawada ACP Shaik Shanu STRONG Counselling to Rowdy Sheeters -Suman TV

సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి.. ప్రాణాలకు తెగించి పోలీసులు డ్యూటీ చేస్తుంటారు. అలాంటి పోలీసులకి విధి నిర్వహణలో.. రౌడీ షీటర్స్, వారి చర్యలు తలనొప్పులుగా మారుతుంటాయి. అసలు వీరిలో చాలా మంది రౌడీ లకి.. పోలీసులు అంటే భయమే ఉండదు. కానీ.., అందరు పోలీస్ లు ఒకలా ఉండరు కదా? పవర్ ఫుల్ పోలీస్ తగిలితే ఎంతటి రౌడీ షీటర్ అయినా వణికిపోవాల్సిందే. తాజాగా.. బెజవాడలో ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఓపెన్ గ్రౌండ్ లో వందల మంది రౌడీ సీటర్స్ సమావేశం అయ్యారు. వారందరిని అక్కడ సమావేశ పరిచింది మాత్రం బెజవాడ మహిళా ఏసీపీ షేక్ షాను.

లేడీ సింగంలా గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఏసీపీ షేక్ షాను.. ముందుగా రౌడీ షీటర్స్ తో ఆవేశంగా మాట్లాడారు. “నేను ఇది వరకే మీ అందరితో మాట్లాడాను. మీలో మార్పు వస్తే.. మీ పేరు మీద ఉన్న రౌడీ షీట్ క్లోజ్ చేస్తా అని మాట ఇచ్చాను. కానీ.., మీరు మారలేదు. ఇంకా వివిధ కేసుల్లో మీ పేరు వినిపిస్తూనే ఉంది. మీకు బాగుపడాలని లేదా? ఇలాగే.. రౌడీయిజం చేస్తాము అంటే.. ఇక పై నా ట్రీట్మెంట్ ఇలా ఉండదు. మీ అందరికీ పోలీస్ కౌన్సిలింగ్ ఇప్పిస్తా! ఏమి.. కౌన్సిలింగ్ కావాలా?” అంటూ.. రౌడీ షీటర్స్ ని వణికించారు ఏసీపీ షేక్ షాను.

Vijayawada ACP Shaik Shanu STRONG Counselling to Rowdy Sheeters -Suman TV“సంవత్సరం చివరికి వస్తున్నాము. మళ్ళీ మీ రౌడీ షీట్స్ పరిశీలిస్తాము. ఈ ఏడాదిలో ఎవరైతే క్లీన్ గా ఉన్నారో.. వారి షీట్స్ తొలగిస్తాను. మీరు ఎలానో చెడిపోయారు. మీ వల్ల మీ కుటుంబాలు కూడా నరకం అనుభవించాలా?” అంటూ.. రౌడీ షీటర్స్ లో మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నించారు ఏసీపీ. అయితే.., ఇదే సమయంలో ఊర మాస్ డైలాగ్ కూడా చెప్పారు. “మీరు తప్పు చేసి మాత్రం నా నుండి తప్పించుకోలేరు. ఒకవేళ మీరు మళ్ళీ రౌడీయిజం చేస్తే.. ఇక మాటలు ఉండవు. అందరినీ నగర బహిష్కరణ చేస్తా అంటూ హెచ్చరించారు మహిళా ఏసీపీ షేక్ షాను. ఏసీపీ వార్నింగ్ తో అక్కడ ఉన్న రౌడీలు అంతా హడలిపోవడం విశేషం. దీంతో.. ప్రస్తుతం ఈ లేడీ సింగం వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి.. డ్యూటీ పట్ల ఈ మహిళా ఆఫీసర్ చూపిస్తున్న కమిట్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.