ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలో వరుడు తుపాకీ చేతిలోకి తీసుకుని ఫైర్ చేశాడు. అది కాస్త అక్కడే నిలబడి ఉన్న యువకుడికి తగిలింది. వెంటనే గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో మనీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. మనీష్ రథం ఎక్కి సంతోషంగా ఊరేగింపులో పాల్గొన్నాడు. అదే సమయానికి ఓ వ్యక్తి వచ్చి మనీష్ కి గన్ ఇచ్చాడు. అసలే పెళ్లి జోష్ లో ఉన్న మనీష్ వెంటనే గన్ తో గాల్లోకి ఫైర్ చేశాడు. ఆ సమయంలో బుల్లెట్ వచ్చి పెళ్లి కుమారుడి స్నేహితుడు బాబు లాల్ యాదవ్ కి తగిలింది. అంతే వెంటనే అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే బాబు లాల్ చనిపోయాడు. ఈ ఘటన అందరూ చూస్తుండగానే జరిగపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతుంది.
చనిపోయిన బాబు లాల్ ఆర్మీలో జవన్ గా పనిచేసేవాడని.. తన స్నేహితుడైన మనీష్ పెళ్లికి వచ్చి సంతోషంలో గన్ ఇచ్చాడని.. ఆ గన్ తన ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడని అందరూ అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. పెళ్లి బారాత్ లో మారణాయుధాలతో చెలగాటం ఆడటం.. గన్ ఫైరింగ్ లాంటివి చేయడం వల్ల పలువురు ప్రాణాలు సైతం పోయాయి. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trigger warning: Gun shot
In UP’s Sonbhadra, groom Manish Madheshia killed his friend and Army Jawan Babu Lal Yadav after the pistol used for celebratory fire during wedding procession accidentally fired. The pistol belonged to the deceased Army jawan. pic.twitter.com/kfjDe9IEG0
— Piyush Rai (@Benarasiyaa) June 23, 2022