జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికి తెలుసు. అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా ఓ తల్లి చేసిన చిన్న తప్పుకు రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో ఇష్టంగా తన కుమారుడికి నూడిల్స్ పెట్టింది ఆ తల్లి.. అవి తిన్న కాసేపటికే ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కకపోవడం విషాదంగా మారింది. తమిళనాడులో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన శేఖర్, మహాలక్ష్మి దంపతులకు.. సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ చిన్నారి కొంత కాలంగా వివిధ అలర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందుకోసం ఆ చిన్నారికి చికిత్స కూడా ఇప్పిస్తున్నారు. ఆ వైద్యుడు ఎలాంటి జంగ్ ఫుడ్స్ పెట్టకూడదని తల్లిదండ్రులకు సూచించాడు. నూడిల్స్ చేసిన తల్లి.. ఆ బాలుడికి పెట్టింది అప్పుడు బాలుడు బాగానే ఉన్నాడు. పడుకుని ఉదయం నిద్రలేచాక కూడా మిగిలిన నూడిల్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు మళ్లీ తినిపించింది. అయితే, అవి తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు సదరు బాలుడు.. వాంతులు చేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.
ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ, అప్పటికే బాలుడు మృతిచెందినట్టు నిర్ధారించారు వైద్యులు. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కొడుకు మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులె బోరున విలపించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. బాలుడి మృతికి నూడిల్స్ కారణంగా భావిస్తున్నారు. రాత్రి చేసిన నూడిల్స్ ఉదయం వరకు ప్రిడ్జ్‌లో పెట్టి తినిపించడం ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు పోలీసులు. ఫ్రిడ్జ్ లో ఉంచిన నూడుల్స్ తినడం.. అలర్జీ ఉన్న కారణంగా కూడా మృతి చెంది ఉండవచ్చు అనుకుంటున్నారు. ఇక నూడిల్స్ పాకెట్ ఎక్సైరీ డేట్ తదితర అంశాలపై దృష్టి పెట్టారు.