కృష్ణాజిల్లాలో విషాదం.. ప్రేమికుల సంచలన నిర్ణయం!

Love failur krishna AP

ఈ కాలంలోని యువతి యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుంటున్నారు. అదే జీవితమనుకుని తల్లిదండ్రులను సైతం పక్కన బెడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చివరికి ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణాజిల్లాలో సంచలనంగా మారింది. ఇక విషయం ఏంటంటే..? కృష్ణాజిల్లాలోని ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల వద్ద ఉంటూ చదువుకుంటోంది. అయితే ఏడాది క్రితం బంధువుల కుమారుడైన పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పులిచర్ల అనిల్ కుమార్ తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా సంవత్సరం గడిచింది. రోజులు గడుస్తున్నా కొద్ది ఇద్దరి మధ్య ప్రేమ మరింత పాతుకుపోయింది. ఇక ఈ విషయం కొన్ని రోజుల కిందట ఇద్దరు ఇంట్లో తెలిసింది. దీంతో వారిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. ఇక ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. వీరిద్దరి తల్లిదండ్రులు వారి ప్రేమకు నిరాకరించడంతో కాస్త మనస్థాపానికి లోనయ్యారు.

ఇక ఈ క్రమంలో అనిల్ ఈనెల 18న బాలిక ఉంటున్న లోపూడి గ్రామానికి వెళ్లి ఆమెను బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి కొత్తగూడెం-యర్రావారిగూడెం మధ్యలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక స్థానికుల సమeచారంతో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.