పెళ్లైన కొన్నాళ్లకే భగ్గుమన్న వివాదం.. భర్తలేని సమయంలో..!

Karnataka

భార్యాభర్తల వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉండాలంటే నమ్మకం, ప్రేమతో పాటు అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలి. ఇలా అర్థం చేసుకునే భార్యాభర్తల జీవితంలో ఎలాంటి చిచ్చులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ కొందరు భార్యాభర్తలు అర్థం చేసుకోక క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక విషయం ఏంటంటే..? తుమకూరు జిల్లా కునిగల్ తాలూకా కెంపసాగర్ గ్రామానికి చెందిన మునిస్వామి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతికి వివాహం జరిగింది. తల్లిదండ్రులు కుదుర్చిన పెళ్లి కావడంతో సంతోషంగా ఉన్నారు. ఇక పెళ్లై రెండు నెలలు గడిచిందో లేదో అప్పుడు ఇద్దరి మధ్య కలహాలు, విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, గొడవలు చేసుకోవడం చేస్తున్నారు.

దీంతో వీరిద్దరి వైవాహిక జీవితం కొంత కాలం అలాగే గడిచిపోయింది. ఇక పెళ్లై నాలుగు నెలలు దాటింది వీరిద్దరి మానసిక పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. దీంతో కొన్నాళ్లు భరించిన భార్య ఓపిక పట్టలేకపోయింది. దీంతో ఇటీవల ఓ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇరుగు పొరుగు వారు ఈ సమాచారంతో ఈ విషయం భర్తకు చేరింది. భార్య చనిపోవడంతో భర్త తట్టుకోలేకపోయాడు. ఇక వెంటనే పురుగుల మందు తాగి తాను కూడా ఆత్మహత్య చేసున్నాడు. ఓకే రోజు భార్యభర్తలు మరణించటంతో ఇరువురి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది.