నేటి సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇంతలా టెక్నాలజీ పరంగా అభిృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా చాలా చోట్ల మూఢనమ్మకాలు ఇంక ఉన్నాయి. మాముల ప్రాంతాల్లోని జనాలు ఇంకా ఆ మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు దారుణాలు చేస్తున్నారు. కొందరు అందినకాడికి దోషనివారణ పూజల పేరుతో అందినంత డబ్బు లాగుతుంటారు. మరికొందరు పూజల పేరు తమ వద్దకు వచ్చిన మహిళలపై, యువతులపై అత్యాచారలకు పాల్పడుతుంటారు. తాజాగా డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అలాంటి దోషం పేరుతో ఆశ్రమానికి పిలిచి అత్యాచారం చేసి, అనంతరం వేధింపులకు గురిచేయండ ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామే కారణం.. సీబీసీఐడీ అధికారులు నిర్ధారించారు. వివరాలల్లోలకి వెళ్తే..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా చెంబేడు గ్రామానికి చెందిన హేమమాలిని(22) ఓ ప్రైవేటు కాలేజిలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. సంవత్సరం క్రితం అనారోగ్యానికి గురికావడంతో బంధువులు వెల్లాత్తుకోటలోని ఓ ఆశ్రమానికి ఆమెను తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి.. నాగ దోషం ఉన్నట్లు నమ్మించి.. తరచూ యువతిని ఆశ్రమానికి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరోసారి అనారోగ్యానికి గురికావడంతో యువతిని బంధువులు మరోసారి ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి వచ్చిన రెండు రోజుల అనంతరం హేమమాలిని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ..తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆశ్రమం నుంచి వచ్చిన రెండు రోజులకు యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మున స్వామిని మాత్రం అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో కేసును సీబీసీఐడీకీ అప్పగించాలని మరోసారి ఆందోళనలు చేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును సీపీసీఐడీకి అప్పగించింది. కేసును నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన సీబీసీఐడీ పోలీసులు యువతిపై ఆశ్రమ నిర్వహకుడు పలుమార్లు అత్యాచారాం చేశాడని,తరచూ తనకు లొంగాలని యువతిని వేధించడం వల్లే మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఆదివారం అర్థరాత్రి ఆశ్రమ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.