35 వేలకే రాయల్ ఎన్ ఫీల్డ్.. 40 వేలకే కేటీఎం బైకులు..

royal enfield KTM

ఇంత తక్కువ ధరకు బైకులు వస్తుంటే కొనేద్దాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం అగండి. ఏ వస్తువైనా అతి చీప్‌గా దొరుకుతుందంటే దాని వెనుక ఏదో మత్‌లబ్‌ ఉన్నట్టే. అదే కోవకు చెందుతుంది. ఈ 35 వేలకే రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌, 40 వేలకే కేటీఎం బైకుల కథ. కష్టపడి పనిచేయలేక, ఈజీ మనీ కోసం తప్పడు దారులు తొక్కుతున్న యువత చేస్తున్న మాయ ఇది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరులోని మురకంబట్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. సరైన డాక్యుమెంట్స్ కూడా లేకపోవడంతో అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగలుగా నిర్ధారించారు. వారిని బంగారుపాళ్యానికి చెందిన రాజేశ్, యాదమరి వాసి ఈశ్వర్‌గా గుర్తించారు.

royal enfield ktmతిరుపతికి చెందిన రాజేశ్ అనే యువకుడితో కలిసి బైక్‌లను దొంగతనం చేస్తున్నట్టు నిర్ధారించారు. యూట్యూబ్‌ ద్వారా బైక్‌లు చోరీ చేసే విధానాన్ని తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని స్పష్టమైంది. తిరుపతి, రేణిగుంట, ఎం.ఆర్‌.పల్లి, అలిపిరి, చంద్రగిరి, ఐరాల, పలమనేరు, చిత్తూరు, కడపలోనూ దొంగతనాలకు పాల్పడిటనట్టు పోలీసులు తెలిపారు. రూ.3.90 లక్షల విలువైన కేటీఎం వాహనాన్ని రూ.40 వేలు, రూ.1.90 లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని రూ.35 వేలకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. చోరీ చేసిన వాహనాలను కొన్నింటిని విక్రయించగా మరికొన్నింటిని ఈశ్వర్‌కు చెందిన తోటలో దాచిపెట్టారు. ఈ బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.