స్టాక్‌మార్కెట్‌లో నష్టం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!

మంచి ఉద్యోగం చేస్తూ.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందు కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు.. తమ కలలు సాకారం చేసుకోవడానికి వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతుంటారు. కొన్ని లాభాలు తెచ్చి పెట్టినా.. కొన్ని మాత్రం తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. తాజాగా స్టాక్ మార్కెట్లో నష్టపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

gagqj minవివరాల్లోకి వెళితే.. చిత్తూరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన భరత్‌ (23) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కరోనా నేపథ్యంలో చిత్తూరులోని తన నివాసంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒక్కో పైసా పోగు చేసి కరోనా కష్ట కాలంలో తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇటీవల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. కానీ దురదృష్టం అతన్ని వెక్కిరించింది.. స్టాక్‌మార్కెట్‌లో రూ.లక్ష వరకు పోగొట్టుకున్నాడు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని నిరాశతో ఆందోళన చెందిన భరత్ మంగళవారం చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళాడు.

gaorg minభరత్ బుధవారం ఉదయం కేఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కొడుకు మంచి ఉద్యోగం చేసి ఉన్నత స్థితికి వస్తాడని భావించిన తల్లిదండ్రులు భరత్ ఆత్మహత్యతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.