రంగంలోకి సజ్జనార్.. చిన్నారి హత్య ఘటనపై కీలక ప్రకటన

sajjanar

హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో చిన్నారి హత్య, అత్యాచార హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితుడు రాజుని కఠినంగా శిక్షించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇక పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకు దొరకకపోవటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిందితుడి సమాచారాన్ని అందించిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పొలీసులు ప్రకటించారు.

ఇక గతంలో దిశ ఘటనలో బాధితులకు సరైన న్యాయం చేసిన సజ్జానార్… మళ్ళీ రావాలంటూ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. నిందితుడి ఫోటో ఆనవాళ్లతో సహా పోస్టర్లు రిలీజ్ చేశారని, బస్టాండులో ఎక్కడున్నా అతడి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. అతడి సమాచారం దొరికితే 9490616366, 9490616627, నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.