సాయి తేజ్ గురించేనా? ఆ పాప గురించి చూపించరా? మీడియాపై మంచు మనోజ్ ఫైర్

నగరంలో సింగరేణి కాలనీలో అత్యాచారం హత్యకు గురైన ఆరేళ్ళ గిరిజన బాలిక కుటుంబానికి ఇప్పటి అరకు న్యాయం జరగలేదు. రాజకీయ, సినీ ప్రేమికులు ఆ కుటంబాన్ని పరామర్శిస్తుండటంతో ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిని కదిలించి వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినీ హీరో మంచు మనోజ్ ఆ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాప తల్లిదండ్రులుకు దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ కాస్త ఎమోషనల్ గా మీడియాతో మాట్లాడారు.

Manchu Manoj Fire On Social Media - Suman TVఇది ఒక దారుణమైన చర్య. ఆ తల్లి నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఒక చేతకాని వాడిలా నిలబడిపోయా. ఈ ఘోరం జరిగి ఆరు రోజులు అవుతున్నాయి. ఇంకా అన్ని ఆ నీచుడి జాడ దొరకలేదు. పోలీసులు కూడా కష్ట పడుతున్నారు. కానీ.., టీవీ ఛానల్ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ అలా పడ్డాడు సాయి ధరమ్ తేజ్ ఇలా పడ్డాడు అంటూ త్రీడీ చేసి చూపిస్తున్నారు తప్ప… ఈ విషయం గురించి ఎవరు చూపించడం లేదు. మీడియా విషయంలో ఫోకస్ పెట్టండి.వాడి ఫోటోలు చూపించండి. ఆ నీచుడు ఎక్కడ ఉన్నా.., వాడిని లాక్కొచ్చి పోలీసులకి అప్పగించాలి అంటూ.. మంచు మనోజ్ ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మంచు మనోజ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.