కొంతమంది ఎందుకు అంత పైశాచికంగా వ్యవహరిస్తుంటారో అర్థం కాదు. మహిళల గౌరవాన్ని నలుగురిలో నవ్వులపాలు చేయడం హీరోయిజంగా భావిస్తుంటారు కొందరు దుర్మార్గపు భర్తలు. మాట వింటే సరే సరి లేకుంటే.. వారి జీవితాన్ని సోషల్ మీడియా వేదికగా నాశనం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. భర్త, భర్త అన్నదమ్ముల వేధింపులు భరించలేని ఒక 28 మహిళ తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా కూడా వేధింపులు తగ్గకపోవడంతో సదరు మహిళ కురార్ పోలీస్ స్టేషన్‌లో భర్త, భర్త అన్నదమ్ములపై ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో పోలీసులు ఆ మహిళ భర్తను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. చాలా కాలంగా దంపతులు ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఒక రోజు సదరు మహిళ సోదరి సోషల్ మీడియాలో వాళ్ల అక్క న్యూడ్ ఫొటోలు, స్నానం చేస్తున్న వీడియో చూసి షాక్ అయింది. వాటిని అక్కకు చూపించింది. అవి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె భర్త అని తెలిసి మరింత షాక్ అయ్యారు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి, ఇప్పుడు ఆమెను నలుగురిలో అవమానించేందుకు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ సారి మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న భర్తను వెతికిపట్టుకునే పనిలో ఉన్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.