బాలికలపై పాస్టర్‌ కీచకపర్వం.. కేసు నమోదు..

crime

మత గురువు స్థానంలో ఉండి ఆథ్యాత్మిక పథంలో నడపాల్సిందిబోయి నీచమైన పనులకు ఒడిగట్టాడు. ప్రార్థనల పేరుతో చేయకూడని పనులు చేశాడు. బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ పాస్టర్‌ చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. చేసిన తప్పుల విషయంలో పశ్చాతాపం పడకపోగా వాటిని కప్పి బుచ్చేందుకు ప్రలోభాలకు తెర లేపాడు. ఇదంతా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడులో జరిగింది ఈ ఘటన. పాస్టర్‌ ప్రసన్న కుమార్‌ గ్రామంలో ఒక చర్చిని నిర్వహిస్తున్నాడు. పెద్దవాళ్లంతాగ పనులకు వెళ్లాక.. పిల్లలను ప్రార్థనలకు అంటూ పిలిపించే వాడు. ప్రార్థన పేరుతో మర్మాంగాన్ని పిల్లల చేతిలో పెట్టి పైశాచికంగా వ్యవహరించాడని పాస్టర్‌పై ఆరోపణలు వచ్చాయి. అలా బాలికలపై లైంగిక దాడి చేసేవాడిని ఆరోపించారు. ఇద్దరు బాలికల వ్యవహారంలో పాస్టర్‌ కథ బయటపడింది. తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని వాళ్లు ఇంట్లోని వాళ్లకు చెప్పుకుని బాధపడ్డారు.

సెటిల్‌మెంట్‌కు డబ్బులు..

గ్రామంలోని పెద్దల సమక్షంలో పలుకుబడి ఉపయోగించి సెటిల్‌మెంట్‌కు చేశాడు. బాలికకు రూ.50 వేలు చొప్పున సెటిల్‌ చేశాడు. ఊరి పెద్దలకు రూ.10 వేలు లెక్క కట్టాడు. పోలీసు కేసు కాకుండా ఉండేందుకు మరో రూ.5 వేలు ఖర్చు చేశాడు. అంతా సెటిల్‌ అయ్యింది అనుకున్నాడు. కానీ, అనుకోకుండా పాస్టర్‌ వీడియోలు ఆ ఊరిలోనే కాకుండా మొత్తం కర్నూలు జిల్లాలో వైరల్‌ అయ్యాయి. ఆ బాధిత కుటుంబం కూడా ధైర్యం చేసి పాస్టర్‌పై ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో పాస్టర్‌ ప్రసన్న కుమార్‌పై పోక్సో, నిర్భయం చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రసన్న కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.