నేటి కాలం అమ్మాయిలు, అబ్బాయిలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడిపోతున్నారు. ఇంతటితో ఆగకుండా చిన్న చిన్న గొడవలతో సర్దుకుపోకుండా క్షణికావేశంలో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు ప్రియురాలి గొంతు కోసి అనంతరం తను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. అది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం కల్లారా పరిధిలోని పజవిలా ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన సుమి, వెంజరమూడ్లోని కీజయిక్కోణంకు చెందిన ఉన్ని గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లకి సుమి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఓ యువకుడితో నిశ్చితార్థానికి కూడా రెడీ అయ్యారు.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: పదేళ్ల కిందట ప్రేమ వివాహం! పూజారి వద్ద శిష్యరికం చేస్తూ చివరికి!
ఇదే విషయమై ఇద్దరి మధ్య కాస్త వివాదం కూడా నడిచింది. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియుడు ఉన్ని ప్రియురాలి గొంతు కోసి అనంతరం చెట్టుకు ఉరేసుకుని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.